సౌత్ లో స్టార్ వారసులు కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా పాపులారిటీని సాధించిన వాళ్ళు చాలా మంది హీరో హీరోయిన్సే ఉన్నారు. అయితే ఇక్కడా ముఖ్యంగా స్టార్స్ కూతుళ్ళు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఏదో రెండు సినిమాలు చేసి వెళ్ళలా ఉండవు ప్లాన్. అందుకు ఉదాహరణ కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ నే తీసుకోవచ్చు. ఈ బ్యూటి ఎంత స్టార్ కూతురైనా హీరోయిన్ గా మాత్రం ప్రొఫషనల్ గా ఉంటుంది. హీరోలతో ఘ్హటు రొమాన్స్, లిప్ కిస్, ఎక్స్‌ఫోజింగ్ ఇలా అన్ని విషయాలలో వృత్తి ధర్మాన్ని పాటిస్తుంది. అందుకే హీరోయిన్ గా సక్సస్ అయింది.

 

ఇక సౌత్ స్టార్ యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా ఇలా హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ బ్యూటి హీరోయిన్ గా తెలుగులో ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. తండ్రికి ఉన్న పరిచయాలతో ఈ అమ్మడు టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిలవ్వాలని సనాహాల్లో ఉంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలను కూడా ఐశ్వర్య కలిసిందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తండ్రి అర్జున్ స్వయంగా ఐశ్వర్య హాట్ ఫొటో షూట్ ని నిర్వహించి వాటిని మేకర్స్ కి పంపుతున్నాడట.

 

అయితే ఇక్కడ స్టార్ హీరో కూతురు అవ్వడం వల్ల ఐశ్వర్యకు ఛాన్స్ లు వస్తాయనుకున్నారు. కాని ఆమెను మాత్రం టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ లైట్ తీసుకుంటున్నారని తాజా సమాచారం. స్టార్ ఫిల్మ్ మేకర్స్.. హీరోలు ఐశ్వర్యపై ఆసక్తిని కనబర్చడం లేదట. అందుకే ఐశ్వర్య తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు తెలుగు నేర్చుకుంటుందట. అయితే వాస్తవంగా ఐశ్వర్య కి కొన్ని నిభంధనలు ఉన్నట్టు తెలుస్తోంది. గ్లామర్ విషయంలో, హీరోలతో రొమాన్స్ విషయంలో, ఎక్స్‌ఫోజింగ్ విషయంలో హద్దులు పెట్టుకుందని అందుకే మన టాలీవుడ్ మేకర్స్ ఐశ్వర్య ని అంతగా పట్టించుకోవటం లేదని అంటున్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి తెలుగు నేర్చుకుంటుందని అందుకే ఇంకా సినిమాలు ఒప్పుకోలేదని బయటకి కలరింగ్ ఇస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: