బన్ని త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ వసూళ్ళు సాధించి నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సాధించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం అనంతరం ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు.

 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ రివేంజ్ డ్రామాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. చిత్తూరు యాసలో మాట్లాడే ఊరమాస్ క్యారెక్టర్ గా అల్లు అర్జున్ పాత్రని తీర్చిదిద్దారట. ప్రస్తుతం ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్ ని డిజైన్ చేస్తున్నారు. గుబురు గడ్డంతో చూడగానే పల్లెటూరిలో ఉండేవారిలా మాస్ లుక్ లో కనిపించనున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోయింది.

 

అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేశాడట. ఇంతకుముందు పదిహేను కోట్లు తీసుకునే అల్లు అర్జున్ ఒక్కసారిగా రెట్టింపు చేశాడని అంటున్నారు. అల వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు అర్జున్ మార్కెట్ బాగా పెరిగింది. అదీగాక బన్నీకి మళయాలంలోనూ మంచి మార్కెట్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట.

 

అయితే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ని పెంచడం వల్ల సినిమాకి నష్టం జరుగుతుందేమో అని ఆ;లోచిస్తున్నారు. నిర్మాతకి రెమ్యునరేషన్ అనేది పెద్ద భారంగా మారనుందని అంటున్నారు. రెమ్యునరేషన్ తగ్గించుకుంటే నిర్మాతకి లాభాలు వస్తాయని, మరీ ఎక్కువగా తీసుకుంటే నిర్మాత పెట్టే డబ్బు మొత్తం రెమ్యునరేషన్ కే పోతుందని చెప్తున్నారు. అల వైకుంఠపురములో రిజల్ట్ చూసిన కొందరు బన్నీ రెమ్యునరేషన్ పెంచడం కరెక్టే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: