కరోనా ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడి ఛస్తున్నారు.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావొద్దని కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.  నిన్న భారత దేశం మొత్తం ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో చిన్న చిన్న ఉద్యోగాలు, దినసరి కూలీలు నానా కష్టాలు పడుతున్నారు. తమను ఆదుకునే వారి కోసం వేయి కళ్లతో ఎదరు చూస్తున్నారు. పని ఉంటేనే ఆ పూట గడుస్తుంన్న పరిస్థితిలో కొంత మంది కష్టాలు వర్ణనాతీతం.  ఇక సినిమా పరిశ్రమలో ఈ ఇబ్బందులు తప్పడం లేదు.. జూనియర్ ఆర్టిస్టులు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారి పరిస్థితి ఇబ్బందుల్లో పడిపోయింది.  

 

ఎప్పుడు షూటింగ్స్ ఉంటే వారికి ఆ పూట పని ఉండటం.. రోజు వారి డబ్బు రావడం జరుగుతుంది. కానీ 31 వరకు అన్నీ బంద్.. లాక్ డౌన్ చేయడంతో దినసరి వేతనానికి చేసేవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట.  రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం.. బియ్యంతో పాటు సరుకుల కోసం కొంత సాయం కూడా చేసేందుకు సిద్ధమైంది.  తమ దగ్గర పనిచేసే వారి కోసం తోచిన సాయం చేసేందేకు కొందరు సిద్ధమవుతున్నారు. వీరిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉన్నారు. జనతా కర్ఫ్యూ, షట్‌డౌన్ ప్రకటించిన వేళ సోషల్ మీడియాలో తాను ఎలా నడుచుకుంటున్నాను.. ప్రజలు ఏం చేస్తే బాగుటుందనే విషయాలపై స్పందించారు ప్రకాష్ రాజ్.

 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. . ‘జనతా కర్ఫ్యూ’తో... నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్‌లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్‌లో ఉద్యోగం చేసేవారికీ... నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించాను. అందుకే నా వద్ద ఉన్న ఉద్యోగస్తులకు ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను.  

మరింత సమాచారం తెలుసుకోండి: