కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఆర్థికంగా అనేక దేశాలు చితికిపోతున్నాయి. ప్రజలు ఇళ్ళలో నుండి బయటకు రాకుండా ఉండిపోతున్నారు. కరోనాని తరిమి కొట్టడానికి ఎవరి ఇళ్లలో వారు ఉండడమే అసలైన ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే నిన్న భారతదేశం అంతటా జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది.

 

 

అయితే కరోనాని తరిమి కొట్టాలంటే ఈ కర్ఫ్యూని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని మార్చ్ 31 వరకు తెలంగాణ అంతా లాక్ డౌన్ లో ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన జబర్దస్త్ యాంకర్ అనసూయ తెలంగాణ లాక్ డౌన్ మంచిదే అని, దానికి తాను కూడా మద్దతు ఇస్తున్నానని తెలిపింది. కానీ ఈ నిర్ణయం సరైనదే అయినప్పటికీ మా లాంటి రోజువారీ పనిచేసుకునే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.

 

 


రోజువారీ పనులకి వెళ్లకుంటే ఇంటి అద్దె, ప‌వ‌ర్ బిల్లులు, ఈఎంఐలు, ఇత‌ర ఖ‌ర్చులు ఎలా భ‌రించాల‌ని వాటి గురించి కూడా ఆలోచించాలని ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఫైర్ అయ్యారు. నీకు నెల వారీ ఖ‌ర్చుల‌కు ఇబ్బందా.. బ్యాంకులో ఉన్న‌దంతా బ‌య‌టికి తీయి.. నీకే అలా ఉంటే మాలాంటి సామాన్యుల ప‌రిస్థితేంటి..చిన్న చిత‌కా ప‌నులు చేసుకునేవాళ్లు ఏమ‌వ్వాలి.. వాళ్లే జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటిస్తుంటే నీకొచ్చిన ఇబ్బందేంటి అని అన‌సూయ‌ను నిల‌దీశారు.

 

 

దీంతో ఇబ్బంది పడిన అనసూయ అలా కాదు నేను వాళ్ల తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నానని ఎంత కవర్ చేసినా మొదట అడిగినపుడు తన లాంటి వారు అని మెన్షన్ చేయడంతో నెటిజన్లు అస్సలు వినట్లేదు. అనసూయకి ఎప్పుడూ ఏదో ఒక వివాదం కావాలి కాబట్టి కావాలనే ఈ విధంగా మాట్లాడుతుందని కొందరు విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: