రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొంత నిజంతో పాటు కల్పితం కూడా ఉంటుందట. నిజ జీవిత పాత్రలని తీసుకుని కల్పిత కథని చెబుతున్నాడట రాజమౌళి.

 


1920 ప్రాంతంలో జరిగిన ఈ కథలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఏం టైంలో కలుస్తారనే ఆసక్తికర చర్చ నడుస్తుంది. నిజ జీవితంలో కొమరం భీం, అల్లూరి పాత్రలు కలుసుకున్నట్లు దాఖలాలు లేవు. మరి వారిద్దరినీ కలిపే సంఘటన ఎలా ఉంటుందనే చర్చ ఊపందుకుంది. రాజమౌళి ఈ సీక్వెన్స్ ని బాగా చిత్రీకరించారట. అంతే కాదు ఈ సినిమాలో రొమాలు నిక్కబొడుచుకునే సీన్స్ చాలా ఉన్నాయట.

 

కొమరంభీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ నిజాం నవాబులతో పోరాడే సన్నివేశాలతో పాటు ఒకానొక ఫైట్ విజువల్ వండర్ గా ఉందనుందట. నిజాం నవాబుల ఆయుధ సామగ్రి తీసుకెళుతున్న ట్రైన్ పై తన సైన్యంతో కొమరం భీమ్ దాడి చేస్తారట. నవాబుల ఆయుధాలను దోచుకెళ్లే క్రమంలో వచ్చే ఈ పోరాట సన్నివేశం విజువల్ వండర్ లా ఉండడం ఖాయం అని చెప్తున్నారు.

 


బాహుబలిలో కాలకేయులతో యుద్ధం లాగా ఈ దాడి కూడా మనల్ని అబ్బురపరుస్తుందట. ఈ ఫైట్ ని విజువల్ వండర్ గా తెరకెక్కించడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ కూడా అద్భుతంగా ఉంటుందని వినిపించింది. వీటన్నింటి వల్ల ఈ సినిమాపై ఆసక్తి రోజు రోజుకీ మరింత పెరుగుతుంది. ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా పదిభాషల్లో విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: