అర్జున్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని హీరో. జెంటిల్‌మ్యాన్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మరింత ద‌గ్గ‌ర‌య్యారు అర్జున్‌. స్ట్ర‌యిట్ చిత్రాల‌ కంటే డబ్బింగ్ చిత్రాల తో సుపరిచితుడైన ఆయన.. ఎన్నో హిట్ చిత్రాల్నిఆయ‌న  అందించారు. ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్.. ఆయన తెలుగు హీరో కాక‌పోయిన‌ప్ప‌టికీ ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు మాత్రం బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ఆయ‌న వ్యక్తిగత విషయాలు చాలా తక్కువగానే బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఈ సీనియర్ నటుడు 32 ఏళ్ల క్రితం పెళ్లాడారు. అది కూడా లవ్ మ్యారేజే. తాజాగా తమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని తన భార్య నివేదితతో కలిసి ఒక మీడియా సంస్థకు ఈ మ‌ధ్య‌నే ఓ విష‌యాన్ని తెలిపారు.

 

అదేమిటంటే... తమది లవ్ మ్యారేజ్ అని చెప్పిన ఆయ‌న‌  పెళ్లి చేసుకునే సమయంలో నివేదిక అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. అప్ప‌టికి ఆ అమ్మాయి మైనర్ కావటం గమనార్హం. ఇంతకీ అర్జున్ లవ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? పెళ్లి వరకూ ఎలా వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుందాం.

 

రూపతార అనే ఓ కన్నడ సినిమా మ్యాగజీన్ లో నివేదిత ఫోటోను ఆయ‌న  తొలిసారి చూశార‌ట‌. ఆమె కన్నడ నటి అని అప్పుడే తెలిసింది. ఫోటో చూడగానే.. ఈ అమ్మాయి బాగుందే అనుకున్నా. డాక్టర్ గారి అబ్బాయి అన్న తెలుగు సినమాకు ఓకే చెప్పినప్పుడు.. ఆ సినిమాకు నివేదితను రికమెంట్ చేశాను. వెంట‌నే ఓకే చెప్పాను. నివేదిత తండ్రి రాజేశ్ అప్పటికే కన్నడలో పెద్ద స్టార్ హీరో. అదే స‌మయంలో మా నాన్న శక్తి ప్రసాద్ విలన్ గా మంచి పేరుంది. వారిద్దరూ మంచి స్నేహితులు. డాక్టర్ గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడే నాకు.. నివేదితకు మధ్య రాపో పెరిగింది.

 

దాంతో ఆ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా సిరింజి చేతికి గుచ్చుకొని చేయి మొత్తం చీలిపోయింది. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వెంట‌నే కుట్లు వేశారు. అదే స‌మ‌యంలో ఈ అమ్మాయి నా పక్కన ఉంది. కళ్లల్లో కన్నీరు కనిపించింది. ఆ రోజు నుంచే ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా సెట్లోనే పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే తనకు ఓకే అంది. మేము వివాహం చేసుకునే స‌మ‌యానికి   నాకుపాతికేళ్లు అయితే.. తనకు పదిహేడేళ్లు. తనకు అప్పట్లో ఇంకా పెద్ద‌గా మెచ్యురిటీ లేదు. చాలా అమాయ‌కంగా ఉండేది. సినిమా ప్రివ్యూలకు వెళితే.. సడన్ గా ఏడుపు వినిపించేది. ఏడుస్తున్నది ఎవరని చూస్తే.. తనే. ఎందుకని అడిగితే చెప్పేది కాదు. ఇంటికి వచ్చి అడిగితే.. ఆ సినిమాలో హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ కావటాన్ని తట్టుకోలేకపోయేది. చాలా ఫీల‌యిపోయేది. బాగా బాధ‌ప‌డేది. నువ్వు యాక్టర్ వే కదా? అంటే.. యాక్షన్ లో భాగంగానే అన్నా.. ఊరుకునేది కాదు. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుందంటూ తన పెళ్లి నాటి ముచ్చట్లను చెప్పుకొచ్చారు అర్జున్. ప్ర‌స్తుతం ఉన్న‌ పరిస్థితుల్లో తీసుకుంటే చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకోవటమే కాదు.. మైనర్ ను నేను వివాహం చేసుకున్నా అని ఆయ‌న తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: