రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తీసిన రంగస్థలం ఎంతటి భారీ బ్లాక్ బస్టర్ సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాతో తన పంథానే కాదు రామ్ చరణ్ ను కూడా డిఫరెంట్ యాంగిల్ లో చూపించాడు సుకుమార్. చరణ్ లుక్ మార్చేయడంతో పాటు నటుడిని కూడా బయటకు తీశాడు. ప్రస్తుతం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్నాడు. అల.. వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

 

 

రామ్ చరణ్ లుక్ మార్చేసినట్టే ఈ సినిమాలో కూడా  బన్నీ లుక్ ను ఊర మాస్ గా మార్చేస్తున్నాడు. మొన్నామధ్య కూడా బన్నీ లైట్ గా గడ్డంతో కనిపించాడు. కానీ.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి బన్నీ పవర్ ఫుల్ మాస్ లుక్ రివీల్ అయింది. జనతా కర్ఫ్యూలో భాగంగా నిన్న సాయంత్రం 5గంటలకు బన్నీ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి క్లాప్స్ కొట్టాడు. ఈ సందర్భంగా కనిపించిన బన్నీ పూర్తి గడ్డంతో కనిపించాడు. దీంతో సుకుమార్ సినిమాలో బన్నీ లుక్ ఇదే అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తానికి సుకుమార్ తనకున్న గడ్డం లానే తన హీరోలకు కూడా గడ్డం పెంచేస్తున్నాడు.

 

 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూతాన్ని నియంత్రించేందుకు దేశ ప్రధాని మోదీ పిలుపు మేరకు నిన్న జనతా కర్ఫ్యూ పాటించిన సంగతి తెలసిందే. కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5గంటలకు ప్రజలందరూ ఇళ్లలోనుంచి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు, స్వచ్ఛ సిబ్బందికి, పోలీసులకు సంఘీభావంగా చప్పట్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ లుక్ పూర్తి రఫ్ గా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు స్తబ్దుగా ఉన్నా బన్నీ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: