ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌ళ్ళూ కూడా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక ఎప్పుడూ షూటింగ్‌లు, పార్టీలు ఫుల్ బిజీ బిజీగా ఉండే  హీరోల‌కు ఇంట్లో ఫ్యామిలీతో వారి ఇళ్ళ‌ల్లో గ‌డిపే స‌మ‌యం చాలా త‌క్కువ దాంతో ఫుల్ బిజీగా ఉండ‌డంతో వారు వారి ఇళ్ళ‌ను ఇళ్ళ‌ల్లో ఉండేవాళ్ళ‌ని చాలా మిస్ అవుతూ ఉంటారు. ఈ నేప‌ధ్యంలోనే మ‌న నేచ‌రల్ స్టార్ నాని కూడా త‌న బాల్క‌నీలో ఒక పెద్ద ర‌హ‌స్యం దాగుందంటే అది నిన్న‌నే బ‌య‌ట‌ప‌డింది. అది కూడా ఎలా అంటే నిన్న జ‌న‌తా క‌ర్ఫ్యూ కార‌ణంగా అంద‌రూ ఇళ్ళ‌ల్లో ఉండ‌డంతో ఒకొక్క‌ళ్ళు ఒక్కో ప‌నిలో ప‌డ్డారు. 

 

అంతే ఇక ఒక్క నిముషం కూడా ఆలోచించ‌కుండా వెంట‌నే దాన్ఇన వీడియో తీసి మ‌రీ నాని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. `ఊరంతా సైలెంట్‌గా ఉంది. ఇన్ని రోజులు కాలుష్యం, శ‌బ్దాల వ‌ల్ల తెలియ‌ని కొత్త కొత్త విష‌యాలు అన్నీ తెలుస్తున్నాయి అంటూ అన్నారు. మ‌న ఇంట్లో.. మ‌న బాల్క‌నీలో…` అంటూ అంటూ అద్భుతంగా ఓ వీడియోని తీసి షేర్ చేశాడు నాని. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్ననేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూని పాటించాల‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రి ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌ఖే ప‌రిమిత‌మ‌య్యారు. సినిమా హీరోలు, హీరోయిన్లు అయితే ఏకంగా షూటింగ్‌ల‌న్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని మ‌రి ఈ క‌ర్ఫ్యూలో స్వ‌చ్ఛందంగా పాల్గొని విజ‌య‌వంతం చేశారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రాల‌న్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. మ‌రి ఎంతో బాధ్య‌త‌తో ప్ర‌తి ఒక్క సెల‌బ్రెటీ దీన్ని పాటిస్తూ ప్ర‌జ‌ల‌ను మేల్కొల్పుతూ ఎప్ప‌టిక‌ప్పుడు ఎల‌ర్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: