టాలీవుడ్ లోకి బొమ్మాళి అనుష్క అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుష్క.  మొదటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత దక్షిణాధిన నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది.  ప్రస్తుతం అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ ప్రమోషన్ లో భాగంగా వివిధ ఛానల్స్ లో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటుంది.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు నటన రాదు.. డ్యాన్స్ రాదు.. కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియదు.. కానీ నన్ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.  

 

నటన అంటే కానీ డ్యాన్స్ బాబోయ్ అనేదాన్ని.. సూపర్  సినిమా షూటింగ్ సందర్భంగా తాను పడ్డ ఇబ్బందుల గురించి చెప్పింది అనుష్క. 'సూపర్‌' లో ఓ పాటకు రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు డ్యాన్స్‌ ఎలా చేయాలో తెలిసేది కాదని, తాను చేయలేనని వారందరి ముందు గట్టిగా ఏడ్చానని చెప్పింది. పరవాలేదు పది రోజులైనా టైమ్‌ తీసుకుని రిహార్సల్స్‌ చేయాలని కొందరు చెప్పారని తెలిపింది. అప్పుడు నా వెంటే ఆ టీమ్ మొత్తం ఉన్నారు.. నాకు ఎంతో ధైర్యం చెప్పారు.  ఆ సినిమా సక్సెస్ కావడానికి వారి కో ఆపరేషన్ ఎంతో ఉంది.  

 

ఒకరకంగా నేను నటిగా సినీ పరిశ్రమలో ఉండటానికి ‘సూపర్’ టీమ్ ఎంతో సహకరించారని అన్నారు.   తన 15 ఏళ్ల కెరీర్‌ పూర్తయిందని, ఇలాంటి సమయంలో కోడి రామకృష్ణ లేకపోవడం బాధాకరమని, ఆయన ఎక్కడున్నా తమతోనే ఉంటారని బాధతో చెప్పింది. ఆయన దర్శకత్వంలో అనుష్క ‘అరుంథతి’ సినిమాలో నటించింది.. ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ పాత్ర.. జేజేమ్మ గా అనుష్కకు ఎంతో పేరు తీసుకు వచ్చింది.  తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: