ప్రస్తుతం కరోనా భయంతో సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్క రకమైన వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. హీరోయిన్లయితే తమ హాట్ హాట్ వర్క్ అవుట్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ ను ఖుషీ చేస్తున్నారు. తాజాగా సౌత్‌ సినిమాల్లో నటించిన ఓ విదేశీ భామ ఆసక్తికర వీడియోతో అభిమానులను అలరించింది.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెలబ్రిటీలు కూడా జిమ్‌ లకు వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా వర్క్‌ అవుట్ చేసుకోవచ్చో చూపిస్తూ ఓ వీడియో చేసి సోషల్ మీడియా పేజ్‌ లో పోస్ట్ చేసింది బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్‌. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన అమీ జాక్సన్‌ టాయిలెట్‌ పేపర్‌ తో వర్క్ అవుట్‌ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది అమీ. తన కొడుకుతో కలిసి ఈ వీడియోను చేసింది అమీ.

 

వీడియోతో పాటు `ఈ వర్క్ అవుట్ చేయడానికి మీకు ఓ స్పెషల్ ఎక్విప్‌ మెంట్ కావాలి. మీరు బాత్ రూమ్‌లో వాడే టాయిలెట్‌ పేపర్‌ను సిద్ధం చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. మనం టాయిలెట్‌ రోల్‌ సర్య్కూట్‌ చేద్దాం` అంటూ కామెంట్ చేసింది` అమీ. ఆ వర్క్ అవుట్స్‌ ఎలా ఎన్ని సెట్స్ చేయాలో కూడా క్లియర్‌గా వివరించింది అమీ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

If we don’t laugh we’ll cry 🤪 Replace the loo roll with a tin of beans if you’re feeling strong 💪🏼 and make sure you’re wearing a cute gym outfit so you don’t look completely ridiculous - @aloyoga ALWAYS 💕#THETOILETROLLCIRCUIT •12 frog leap & squats •45 seconds loo roll drills •12 push ups •12 side planks (each side) •45 seconds plank X5 #selfisolation #toiletpaper #homeworkout

A post shared by Amy Jackson (@iamamyjackson) on

మరింత సమాచారం తెలుసుకోండి: