చైనాలో పుట్టిన కరోనా వైరస్ అక్కడ కొంత తగ్గుమొఖం పట్టగా వేరే దేశాల్లో విజృంభిస్తోంది. తాజాగా అమెరికాలో హాలీవుడ్‌ హీరోయిన్‌ తండ్రి కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. ఈ వైరస్ కు వారు వీరు చిన్నా పెద్దా అనే తేడా లేదు.  ఎవరిని వదలడం లేదు.  ఇప్పటికే హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమందికి కరోనా వైరస్ సోకింది.  హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ ను కు ఇప్పటికే కరోనా సోకినా సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ స్టార్ హీరో కోలుకుంటున్నారు. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు.  

 

ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్దులు కరోనా బారిన పడితే మృత్యు ఒడికి వెళ్తున్నారు. కరోనా కారణంగా సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు అంతా కూడా గజగజ వణికి పోతున్నారు. వేరే ఏదైనా జబ్బు వస్తే డబ్బుతో నయం చేసుకోవచ్చు. డబ్బున్న వారు విదేశాలకు వెళ్లి అయినా నయం చేసుకుంటారు. కరోనా వైరస్ వల్ల తన తండ్రి మరణించారని.. తన తండ్రి కరోనా విషయాన్ని సోఫియా కొన్ని రోజుల ముందు చెప్పుకొచ్చింది.  సోఫియా ఓ వీడియోని సోషల్ మాద్యంలో పోస్ట్ చేస్తూ.. ‘అందరినీ హెచ్చరిస్తున్నాను.

 

కరోనా వ్యాధి సోకిన మా నాన్నను ప్రత్యేక వార్డుకి తరలించారు. అక్కడ అందరూ కరోనా బాధితులే. ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. వారిలో ఎక్కువమంది వృద్ధులే ఉన్నారు. కాబట్టి దయచేసి కరోనాను సీరియస్‌గా తీసుకోండి’ అని ఆ వీడియాలో తెలిపింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దీ రోజుల తర్వాత ఆమె తండ్రి కారొనతో కన్నుమూశారు. సినీ పరిశ్రమకు చెందిన వారిలో మొదటి మృతి అవ్వడంతో యావత్ ప్రపంచం మొత్తం మొత్తం ఒకింత షాక్కు గురి అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: