తెలంగాణలో లాక్‌ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు అన‌సూయ చేసిన ట్వీట్‌తో  ఆమెను ప‌నిగ‌ట్టుకుని కొంత‌మంది ట్రోల్ చేశారు. దీంతో చిర్రెత్తుకు వ‌చ్చిన రంగ‌మ్మ‌త్త అంతే వాడివేడిగా..ఘాటుగా స‌మాధానాలిచ్చి వారి నోళ్లు మూయించింది. అయితే అన‌సూయ‌పై మాత్రం వారి ట్రోలింగ్ దండ‌యాత్ర‌ను మాత్రం కొంత‌మంది ఆప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కి అన‌సూయ మంత్రి కేటీఆర్‌కు చేసిన ట్వీట్ ఏంటంటే...‘‘సార్.. ప్రభుత్వం మీద గౌరవంతో మీ నిర్ణయాల‌కు కట్టుబడి ఉంటాం. కొన్ని వృత్తులవారిని పరిగణనలోకి తీసుకొని ఈ విషయం చెబుతున్నా. మేం పని చేయలేకపోతే.. మా సంపాదన ఆగిపోతుంది. మాకు నెలవారీ తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. ఇంటి అద్దె, కరెంట్ బిల్స్, ఈఎంఐ తదితరాలు కట్టుకోవాలి.

 ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’’ అని అనసూయ ట్వీట్‌లో పేర్కొన్నారు. జ‌న‌తా క‌ర్ఫ్యూను కొన‌సాగిస్తూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తీసుకురావ‌డాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ రెక్వెస్టును పెట్టింది. అయితే ఈ ట్వీట్‌ను త‌ప్పుబ‌డుతూ అన‌సూయ నీకు డ‌బ్బులు త‌క్కువా, రెంటు క‌ట్ట‌లేక‌పోతున్నావా అంటూ ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదని, ప్రజల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. సంపాదన ఆగిపోతుందని ఇలాంటి రిక్వెస్ట్ చేస్తారా..? అంటూ అనసూయపై ఎదురు దాడి మొదలుపెట్టారు. ‘‘ప్రాణాలే పోతాయంటే డబ్బులు కోసం మాట్లాడుతున్నావేంటి.. ఇంత బాధ్యతారాహిత్యమా’’ అంటూ అనసూయపై మండిప‌డ్డారు. ఒక‌త‌ను అయితే యూజర్ అసభ్యకరంగా కామెంట్ చేశాడు. 

 

‘‘మాకు తెలుసు ఎలా వచ్చావో అక్కడి వరకు. నైట్స్ బాగా కష్టపడి వర్క్ చేశావు’’ అని హద్దులు మీరాడు. దీంతో అనసూయకు ఒళ్లుమండింది. ‘‘డే అండ్ నైట్.. నీ తల్లిదండ్రులు నీ కోసం పనిచేసినట్టుగానే. ఒకళ్లని అనే ముందు మనకి కూడా జీవితం ఉంది, వాళ్లకూ జీవితం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి సార్. నా పేరు.. టీవీలో నా షోలు.. సినిమాల్లో నా నటన చూడటం తప్ప మీకు నా గురించి ఏం తెలుసని.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి’’ అంటూ ఘాటుగా స్పందించారు. అలాగే తాను మాట్లాడింది కేవలం తనను ఉద్దేశించి కాదని.. ఈ 10 రోజుల్లో ఇబ్బందిపడే వారందరికోసమని అనసూయ అన్నారు. ‘ఇది మీ చిన్న బుర్రలకు అర్థం కాదు’ అని సెటైర్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: