హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్స్టీన్ను దరిద్రం వెంటాడుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ సినిమాల్లో టాప్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న హార్వీ అనూహ్య పరిణామాల మధ్య విమర్శల పాలయ్యాడు. పలువుడు హాలీవుడ్ తారలు హార్వీ మమ్మల్ని లైగింకంగా వేదించాడన్న ఆరోపణలు చేయటంతో ఆ ప్రతిష్ట మసకబారింది. మరికొంత మంది తారలు హార్వీ తమను రేప్ చేశాడంటూ ఆయన మీద చట్టపరమైన చర్యలు దిగారు.
ఇటీవల కాలంలో అన్ని ఇండస్ట్రీలలో మీటూ ఉద్యమం ఊపందుకుంది. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో ఈ ఆరోపణలు చాలా మంది పై వచ్చాయి. మన దేశంలోనూ పలువురు సీనియర స్టార్స్ మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే కొందరిపై ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మహిళలు స్వయంగా తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వెల్లడించేందుకు ముందుకు వస్తుండటంతో తప్పుడు వ్యక్తుల బండారం బయటపడుతోంది.
మీటూ ఆరోపణల కారణంగా హాలీవుడ్ సంచలనంగా మారిన హార్వీ వెయిన్స్టీన్ కు ఇటీవల న్యూయార్క్ సుప్రీం కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బడా నిర్మాతకు మరో షాక్ తగిలింది. ఆయనకు కరోనా వైరస్ సోకినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన్ను ఎవరితో కలవనీయకుండా ఐసోలేషన్లో ఉంచినట్టుగా జైలు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రెస్ రిపబ్లికన్ అనే పత్రిక వెల్లడించింది. అయితే ఈ వార్తలను అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
View this post on InstagramHarvey Weinstein has tested positive for coronavirus in prison, according to a local newspaper report. More details at the link in bio (📸: @shutterstocknow)