తెలుగు ఇండస్ట్రీలో ఛలో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ.. కన్నడ బ్యూటీ రష్మిక వెంటనే పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ చిత్రంలో నటించి సంచలన విజయం అందుకుంది.  ఆ తర్వా దేవదాస్, డీయర్ కామ్రెడ్ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ తో మరో సూపర్ హిట్ అందుకుంది.  అదృష్టం ఈమె ఇంటి ముందు తిష్ట వేసుకొని కూర్చున్నట్లే నటించిన ప్రతి సినిమా వరుస విజయాలు అందుకోవడంతో ఈ బ్యూటీకి గోల్డెన్ హ్యాండ్ గా గుర్తింపు వచ్చింది.  ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తుంది.

 

 తాజాగా రష్మిక మరో అదృష్టాన్ని చేజిక్కించుకుందని అంటున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఆయన నక్సల్ పాత్రలో కనిపిస్తారట. ఆ పాత్రలో మొదట రామ్ చరణ్ ని అనుకున్నారు. కానీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో నటించడంతో ఆ స్థానంలో బన్నీని అనుకున్నారు.  ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు.  ఆ పాత్రలో మహేష్ బాబుని అనుకున్నప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో తేడా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానంలో రామ్ చరణ్ నే తీసుకుంటున్నారట.

 

ఆయనకు జోడీగా సమంత చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కైరా అద్వాని డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. తాజాగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. చరణ్ జోడీగా రష్మికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఒక వైపున సుకుమార్ సినిమాలో బన్నీ సరసన నటించడానికి రష్మిక సెట్స్ పైకి వెళ్లనుంది.  మెగా హీరోలిద్దరి సినిమాల్లోను ఒకేసారి ఛాన్స్ కొట్టేసినప్పుడు, రష్మికను అదృష్టవంతురాలని కాక మరేమంటారు? అందుకే ఈ అమ్మడిని గోల్డెన్ హ్యాండ్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: