రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకు పోతున్నాడు. వరస పెట్టి ఫ్లాపులు పడినా గాని టాప్ మోస్ట్ డైరెక్టర్లు అంత విజయ్ దేవరకొండ తో పనిచేయాలని అదేవిధంగా హీరోయిన్లు కూడా కనీసం లైఫ్ లో ఒక్కసారైనా విజయ పక్కన నటించాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా మనసులో మాట బయట పెడుతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ దారుణమైన ఫ్లాప్ చూడడం జరిగింది. అయినా గాని మరోపక్క కచ్చితంగా నెక్స్ట్ పూరితో చేయబోయే సినిమా తో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు విజయ్ దేవరకొండ.

 

ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది అంటూ ఓపెన్ గానే తోటి నటీనటులు ఫిల్మీ క్రష్ గురించి చెబుతున్న సందర్భంలో కామెంట్లు చేయడం జరిగింది. అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ సౌత్ హీరో విజయ్ దేవరకొండ తో నటించాలని అతడు తన ఫిల్మి క్రష్ అంటూ ఓపెన్ గా ప్రకటించింది. ఇదే సందర్భంలో విజయ్ దేవరకొండ కూడా జాన్వీ తో ప‌ని చేయ‌డానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఉత్సాహంగా ఉన్నట్లు తెలపడం జరిగింది.  జాన్వీ క‌పూర్, కియ‌రా అద్వానీ.. వీళ్లిద్ద‌రితో న‌టించాల‌ని ఉందంటూ విజ‌య్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటి వాటి గురించి చెప్పాడు.

 

కియ‌రాతో ఇప్ప‌టికే విజ‌య్ కు స్నేహం ఉంది. తాజాగా ఈ జాబితాలోకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో కాస్త స్పీడ్ తగ్గింది. తాజాగా ఇంటర్వ్యూలో విజ‌య్ తో ప‌ని చేయాల‌ని ఉందంటూ గోల గోల చేస్తూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. అంతే కాకుండా అతను యాటిట్యూడ్ మరియు నటన చాలా ఇష్టం అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. దీంతో నెటిజన్లు విజయ్ కి సరైన హిట్ లేదు...నీ పరిస్థితి కూడా అలాంటిదే..బాగుంది నీ కోరిక అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: