దేశంలో ఇప్పుడు కరోనాను కట్టడి చేయడానికి గాను అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. వినోద కార్యక్రమాలను అన్నింటిని రద్దు చేస్తున్నాయి. ఎక్కడా ప్రజలు ఒక చోట ఉండకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. వినకపోతే చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నాయి దేశాలు. ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ అనేది కట్టడిలోనే ఉంది. ఇది విస్తరిస్తే ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అన్ని కఠిన చర్యలను తీసుకోవాలని భావిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. 

 

సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వకుండా చూడాలని కేంద్రం భావిస్తుంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే సినిమా హాల్స్ ని కూడా ఇప్పట్లో తెరవ కుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అన్ని విధాలుగా చర్యలను తీసుకునే విధంగా ఇప్పటికే సిద్దమైన కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ స్ ని కూడా వాయిదా వేసుకోవాలని చెప్పే అవకాశాలు ఉన్నాయి. విదేశాల నుంచి నటులు ఎవరిని ఇప్పట్లో రానీయకుండా చూడాలని కేంద్రం భావిస్తుంది. ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసారు. 

 

ఇప్పుడు ఈ విధంగా కూడా నిర్ణయం తీసుకుని సినిమాలను పూర్తిగా అడ్డుకోవాలని తేడా వస్తే మాత్రం అందరూ బాధపడాలని సినిమా వాళ్లకు చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా కట్టడి లో ఉంది కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా సరే మూల్యం భారీగా చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే సినిమాల షూటింగ్, ప్రకటనల షూటింగ్ అన్నీ కూడా నిలిపివేయాలని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం దేశం లో కరోనా కేసుల సంఖ్య 420 కి చేరుకున్నాయి. మరణాల సంఖ్య కూడా 9 వరకు చేరుకున్నాయి. ప్రస్తుతం అదుపులోనే ఉంది. తెలంగాణాలో 33 కి చేరుకున్నాయి కేసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: