ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు.  ఏకంగా లక్షల మందికి ఈ కరోనా వైరస్ సోకింది.. కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు 192 దేశాల్లోని ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా 3,41,243 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు 14,746 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇటలీ ప్రజలే 5,476 మంది ఉన్నారు .చైనాలోని వుహాన్ నగరంలో అంతుచిక్కని వ్యాధిగా మొదలై కరోనా వైరస్ గా నామకరణం చేసుకున్న మహమ్మారి ఇప్పుడు ప్రపంచానికి సవాల్ విసురుతోంది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్ భూతాన్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

 

అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఉమ్మడి కార్యాచరణ లేకపోవడంతో బాధితుల సంఖ్య కొద్దికాలంలోనే విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఈ కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా పడుతుంది.  ఇప్పటికే హాలీవుడ, బాలీవుడ్ ఒక్కటేమిటి అన్నీ సినీ పరిశ్రమలు మూతపడ్డాయనే చెప్పాలి. ఒకటీ రెండు తప్ప చాలా సినిమాల షూటింగ్ వాయిదా వేసుకున్నారు.  ఈ ప్రభావం సినీ రంగంపై కూడా తీవ్ర స్థాయిలో పడింది. కరోనా ప్రభావం కారణంగా భారతీయ సినీ పరిశ్రమ ఏకంగా రూ.1500 కోట్లు నష్టపోనుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలైన `సూర్యవంశీ`, `83` వంటివి కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

 

భారత్‌లో మార్చి 31 తర్వాత పరిస్థితి సద్దుమణిగినప్పటికీ ఓవర్సీస్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఒక్కో వీకెండ్‌కు ఇండియన్ సినిమాకు రూ.400 కోట్ల చొప్పున నష్టం కలుగుతోందట. ఏది ఏమైనా చైనావాడు పంపిన ఈ భయంకరమైన ప్రొడెక్ట్ దేశ వ్యాప్తంగా నష్టాలను చేకూరుస్తుందని తెగ బాధపడిపోతున్నారు జనాలు. ప్రస్తుతం భారత్ లో లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే..దాంతో మరికొన్ని రోజుల పాటు నిశ్శబ్ద వాతావరణం ఉంటుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: