ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భాయాందోళనలకి గురౌతున్న సంగతి తెలిసిందే. ఒక్క ఇటలీలోనే రోజుకి 600-700 మంది కరోనా వైరస్ సోకి మరణిస్తున్నారు. ప్రపంచం లోని అన్ని దేశాల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే ఎక్కడికక్కడ ఎవరికి వారు స్వీయ నిర్భందం చేసుకుంటున్నారు. సామాన్య ప్రజల దగ్గర్నుంచి సినిమా సెలబ్రెటీల వరకు అందరూ ఇంట్లోనే ఉంటు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయినా కూడా ఈ వ్యాధి బారిన పడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

ఈ నేపథ్యంలో పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. జేమ్స్ బాండ్ హీరోయిన్ ఓల్గా కురెలెంకోకు కరోనా పాజిటివ్ అని కొన్ని రోజుల క్రితం వెళ్లడయ్యింది. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆమె పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ప్రత్యేకంగా వైధ్యుల సమక్షంలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అయితే చాలామంది ఆమె ఇక బ్రతకడం కష్టం అని నిర్ధారించుకున్నారు. అందుకు కారణం అత్యంత వేగంగా ప్రభావం చూపించి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తి ఊపితిత్తులు పనిచేయక నిముషాల వ్యవధిలోనే వందల ప్రాణాలు పోతున్నది ప్రత్యక్ష్యంగా చూడటమే.

 

కాని రెండు వారాల పాటు పూర్తిగా ఓల్గా కురెలెంకో ఐసోషలేషన్ లో ఉన్నారు. ఆ సమయంలో ఓల్గా కురెలెంకో తన పిల్లలను కూడా చూడకుండా ఉన్నారు. ఇంతగా జాగ్రత్తలు పాటించినందుకు సరైన సయమలో ట్రీట్ మెంట్ తీసుకోవడంతో మృత్య్వాత పడుతుందనుకున్న ఓల్గా పూర్తిగా కరోనా విముక్తి పొందిందట. ఈ విషయాన్ని స్వయంగా ఓల్గా వెల్లడించారు. తన కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి కరొనా నుండి బయట పడ్డట్టు ప్రస్తుతం కొడుకు ఆనందంగా గడుపుతున్నట్లుగా తెలిపింది.

 

కరోనాను ఎదుర్కొన్న సమయంలో ఓల్గా తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు. మొదటి వారం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. విపరీతమైన జ్వరం, తలనొప్పితో బాధపడ్డారట. ఆ తర్వాత వారంలో ఎక్కువగా దగ్గు రావడం త్వరగా అలసి పోయేదట. అయితే రెండవ వారం పూర్తయ్యోసరికి జ్వరం, దగ్గు పూర్తిగా తగ్గిందట. ప్రస్తుతం కరోనా నుండి విముక్తి పొందినట్టు ఎలాంటి అనారోగ్యం సంస్యలు లేవని వెల్లడించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: