ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ డం సంపాదించిన హీరోలు ఇప్పటి జనరేషన్లో లేరు. కేరాఫ్ అడ్రస్ పెట్టుకునే హీరోలుగా వస్తున్నారు. ఆ తరువాత వారి పెద్దోళ్ళ బిరుదులను షార్ట్ కట్ చేసుకుని తమకు కూడా  తగిలించేసుకుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే టాలీవుడ్లో ఇపుడు అంతా వారసుల మయం అయిపోయింది.

 

అటువంటి తరుణంలో సొంత ప్రతిభలో వచ్చి ఈ స్థాయికి ఎదిగిన నటుడిగా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. ఆయనలో ఏదో స్పెషాలిటీ ఉందని తలపండిన సినీ పెద్దలు కూడా చెబుతారు. విజయ్ దేవరకొండకు ఈ మధ్య సరైన హిట్లు లేవు కానీ ఆయన స్టార్ ఇమేజ్ మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు.

 


పైగా ఆయన‌కు లేడీస్ ఫాలోయింగ్ అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. అర్జున్ రెడ్డి మూవీతో  రౌడీ హీరోగా ముద్రపడిన విజయ్ బాగానే అమ్మాయిల  గుండెల్లో అభిమానం సంపాదించాడు. ఇక ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన లేటెస్ట్  మూవీ వరల్డ్ ఫ్యామస్ లవర్ భారీ డిజాస్టార్ అయింది. 

 

ఇపుడు పూరీ డైరెక్షన్లో ఆయన ఫైటర్ మూవీ చేస్తున్నాడు. ఈ మధ్య ఆయన ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇద్దరు హీరోయిన్లతో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టేసుకున్నాడు. ఆ ఇద్దరు పేర్లు చెబితే అందరికీ షాక్ గా ఉంటుంది.

 

అందులో ఒక హీరోయిన్ జాన్వీ కపూర్. అంటే ఆలిండియా లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి వారసురాలు. జానూ సైతం తనకు విజయ్ తో నటించాలన్న కోరికను ఎపుడో బయటపెట్టింది. అది కుదరడంలేదులా ఉంది ఇద్దరికీ. ఇక మరో హీరోయిన్ కైరా అద్వానీ. ఆమె తెలుగులో  మహేష్ బాబు. చరణ్ లతో నటించింది.

 

ఆమెతో నటించాలని కూడా విజయ్ కోరుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరు  ముద్దు గుమ్మలతో విజయ్ ఎపుడు హాట్ హాట్ రొమాన్స్ చేస్తాడోనని అభిమానులు కూడా వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: