టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ..ఇలా స్టార్ సెలబ్రెటీస్ అంతా ఫిట్ నెస్ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సగం సినిమాలలో హాట్ గా కనిపించి ప్రేక్షకులను కవ్వించడానికే నడుమొంపులతో సహా, యద అందాలు ఆకట్టుకునే లా కసరత్తులు చేసి ఫిట్ నెస్ తో తయారవుతున్నారు. ఈ విషయంలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎక్సర్ సైజులను చేస్తూ తమ శరీరాన్ని అందంగా మలచుకుంటున్నారు. ఈ విషయం చిట్టి పొట్టి జిం డ్రస్సులలో ఈ బ్యూటీలు అప్పుడప్పుడూ పోస్ట్ చేసే ఫొటోలు - వీడియోలు చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమవుతుంది. 

 

ఎక్కువగా ఈ వీడియోలు ఫొటోలు అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, బాలీవుడ్ బ్యూటి కియారా అద్వాని నెట్ లో హల్ చల్ చేస్తూ అభిమానులను కవ్విస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా బాలీవుడ్ భామ సారా అలీఖాన్ పోస్ట్ చేసిన ఫిట్నెస్ వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. 'సింబా' - 'కేధారినాధ్' సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా అలీఖాన్... సైఫ్ అలీఖాన్ నట వారసురలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు సినిమాల్లోనే నటించినప్పటికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెంచేసుకుంది. 

 

ఇక కరోనా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని మొత్తం హడలిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అందరు సెలెబ్రిటీలు అందరూ ఎవరికి వారు స్వీయ నిర్బంధం చేసుకున్న విషయం  తెలిసిందే. వారిలో సారా అలీఖాన్ ఉంది. కరోనా గురించి ఆందోళన చెందుతున్న ఈ సమయంలో దాని నుండి బయటకి రావడానికి వర్క్ ఔట్స్ చేస్తే చాలని - దీని కోసం జనాలతో కలిసి జిమ్ కి వెళ్ళవలసిన అవసరం లేదని ఇంట్లోనే చిన్న చిన్న ఆసనాలు వేస్తూ బాడీ ఫిట్ గా ఉంచుకోవచ్చని సూచించింది. మనం ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి వైరస్ మన దరిచేరదని చెప్పుకొచ్చింది. ఇది తెలిసిన అభిమానులు సారా అలీఖాన్ చేస్తున్న మోటివేషన్ ప్రోగ్రామ్ ని మెచ్చుకుంటున్నారు. అయితే కొంతమంది ఆంటి ఫ్యాన్స్ మాత్రం దీనిని విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: