హార్వే వీన్ స్టెయిన్.. ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరు. స్టార్ ప్రొడ్యూసర్ గానే కాదు ప్రతిష్టాత్మక 'ఆస్కార్' అవార్డు సాధించి 'మీటూ' 'కాస్టింగ్ కౌచ్' ఉద్యమాలకి ఆజ్యం పోసి మన ఇండియాలో కూడా అందరికి బాగా పరిచయమున్నవాడే హార్వే వీన్ స్టెయిన్. 2017లో దాదాపు 15 మంది హీరోయిన్లకు పైగా హార్వేపై చేసిన లైంగిక ఆరోపణల ద్వారా తెరపైకి వచ్చాడు హార్వే. తన కెరీర్ మొత్తంలో 80 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆధారలతో బయటపడ్డట్టు అప్పట్లో సంచలనం అయింది. ఆ తర్వాత  మీటూ' 'కాస్టింగ్ కౌచ్' ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా వివాదంగా మారాయో అందరికి తెలిసిందే. 

 

నార్త్ సౌత్ సహా యావత్ చిత్ర పరిశ్రమలు తలదించుకునేలా చేసిన సంచలనమైన సంఘటన అని చెప్పక తప్పదు. పోలీసుల అతి దారుణంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి అన్ని నిజాలను బయటకి కక్కించిన హార్వేకి కోర్టు 23 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన సంచలనం అయిన సంగతి తెలిసిందే. గట్టి బందోబస్త్, బలగాల మధ్య న్యూయార్క్ స్టేట్ జైలులో చిప్పకూడు తింటున్న ఈ రేపిస్ట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 

 

తాజా సమాచారం ప్రకారం ఈ రేపిస్ట్ ప్రొడ్యూసర్ కి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయట. అతనితోపాటు గదిలో ఉన్న మరో ఒకరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందట. అయితే ఈ విషయంపై జైలు అధికారులు మాత్రం జైలు అంతర్గత విషయాలు బయటకి చెప్పే అధికారం లేకపోవడం తో ఎలాంటి సమాచారం బయటకి వెల్లడించడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే హార్వే రీసెంట్ గా తన పుట్టిన రోజును జైలు గోడల మధ్య జరుపుకున్నాడు. హార్వే కి కరోనా సోకిందని తెలిసిన వాళ్ళు మాత్రం ఇలాంటి వాళ్ళకి సరైన శిక్ష పడిందని ఇంతమందిని నాశనం చేసిన వాడికి ఇది జరగడం న్యాయమే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: