మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లేటెస్ట్ గా ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఏర్పాటుచేశారు. ఆహా అంటూ కొత్త డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఏర్పరచిన అల్లు అరవింద్ దాన్ని అనుకున్నంత రేంజ్ లో తీసుకురాలేకపోతున్నాడు. వెబ్ సీరీస్ లు హిట్ అవ్వాలి అంటే దానిలో అడల్ట్ కంటెంట్ బాగా ఉండాలి. లేదా స్ట్రాంగ్ కంటెంట్ తో రావాలి. ప్రస్తుతం ఆహాలో వచ్చిన మస్తీ, రాబోతున్న రన్ ఈ రెండు రోటీన సబ్జెక్ట్ లానే ఉన్నాయని తెలుస్తుంది. అందుకే ఆడియెన్స్ ఆహాని పట్టించుకోవడం మానేశారు. క్రిష్ ఇప్పటికే వరుసగా వెబ్ సీరీస్ లు నిర్మించేలా ప్లాన్ చేసుకున్నారు. 

 

ఇక ఆహా కోసం మరో దర్శకుడిని రంగంలో దింపుతున్నాడు అల్లు అరవింద్. ఆయనే మారుతి.. ఈరోజుల్లో సినిమా నుండి ప్రతిరోజూ పండుగే సినిమా వరకు మారుతి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. గీతా కాంపౌండ్ కు చాలా క్లోజ్ గా ఉండే మారుతి ఆహా యాప్ కోసం కొన్ని స్క్రిప్ట్స్ అందిస్తున్నాడట. తను కథలు రాసి తన అసిస్టెంట్ ల చేత డైరక్షన్ చేయిస్తాడని తెలుస్తుంది. ఆహాలో ఇక మీదట మారుతి కథలతో కూడా వెబ్ సీరీస్ లు వస్తాయని తెలుస్తుంది. 

 

మారుతి మొదట్లో ఈరోజుల్లో, బస్టాప్ లాంటి సినిమాల్లో కొద్దిగా అడల్ట్ కంటెంట్.. బూతు డైలాగ్స్ టోన్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే అది కేవలం తన సినిమాలు ఆడేందుకు వేసిన స్టెప్ అని తర్వాత తెలిసింది. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతి తన పంథా మార్చుకున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ దానిలో తన మార్క్ కామెడీ టచ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. మొత్తానికి ఆహాలో మారుతి స్టోరీస్ అంటే పాపులారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టే లెక్క. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: