త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఒక్కసారి కనెక్ట్ అయితే ఇంక అతన్ని విడిచిపెట్టడం కష్టం. ఫెవికాల్ ఫ్రెండ్ షిప్ లా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెబుతారు. అయితే త్రివిక్రమ్ కూడా ఇలాగే తనకు ఎవరైనా నచ్చితే చాలు.. వాళ్లను అసలు వదిలిపెట్టడు. వాళ్లతోనే జర్నీ కంటిన్యూ చేస్తుంటాడు. ఇప్పుడో మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఇలాగే రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. 

 

హీరోలు, హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు అనే తేడా లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పనిచేసిన వాళ్లంతా ఆయన ఓ అయస్కాంతం అని చెబుతారు. ఆ ఆకర్షణ శక్తికి ఎవరైనా అతుక్కొని పోవాల్సిందే అని పబ్లిక్ స్పీచ్ లోనూ చెప్పారు. అలాంటి గురుత్వాకర్షణ శక్తి ఇప్పుడు తమన్ ను అతుక్కుపోయింది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు త్రివిక్రమ్. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. అరవింద సమేత సినిమా తర్వాత తారక్, త్రివిక్రమ్ కలిసి చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. హిట్ కాంబో అనే ఇదిలో ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ తోన ట్రేడ్ వర్గాల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నాడట త్రివిక్రమ్. 

 

అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలకు తమనే మ్యూజిక్ ఇచ్చాడు. అల వైకుంఠపురములో పాటలు అయితే తమన్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఈ ఆల్బమ్ తో తమన్ రేంజ్ తర్వాతి లెవల్ కు వెళ్లింది. ఈ ఇమేజ్ ను మళ్లీ చూపించేందుకు తారక్ సినిమాకు తమన్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్. మరి త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీకి తమన్ ఏ రేంజ్ సాంగ్స్ ఇస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: