కరోనా వైరస విజృంభనను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోది ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా మద్దతు తెలిపారు. అదే సమయంలో ప్రాణాలకు తెగించిన ఈ కష్టకాలంలో తమ విధులను నిర్వర్తిస్తున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు చప్పట్లు కొడుతూ సంఘీభావం తెలిపాలని కోరారు ప్రధాని. జనతా కర్ఫ్యూకు భారీగా మద్దతు తెలిపిన ప్రజలు సంఘీభావం తెలిపే విషయంలో మాత్రం కాస్త అత్యుత్సాహం తెలిపారు.

 

తమ ఇంటి బాల్కనీలు, కిటీకీల నుంచి సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టాలని ప్రధాని కోరితే, కొంత మంది ప్రజలు మాత్రం గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి చప్పట్లు కొడుతూ గంటలు మోగిస్తూ, శంఖాలు ఊదుతూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారు. ఒక మీరి మరో మనిషికి దూరంగా ఉండాలని జనతా కర్ఫ్యూ పాటిస్తే అది అర్థం చేసుకోకుండా ప్రజలు గుంపులుగా రోడ్ల మీదకు రావటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ ఘటనలపై కృతీ సనన్‌, గిప్పి గ్రేవాల్, నియా శర్మ లాంటి చాలా మంది స్టార్స్‌ ఖండించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిలో కృతి `సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రజల్లో వచ్చిన ఐఖ్యత చూసిన నాకు గర్వంగా అనిపించింది. కానీ ఆ తరువాత సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చేస్తే కోపం వచ్చింది. ప్రజలు గుంపులు గుంపులుగా అలా చేయటం ఏంటి.. అసలు వాళ్లకు ప్రధాని ఏం చెప్పారో అర్ధం అయ్యిందా..?` అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలే కాదు పలువురు సాధారణ ప్రజలు కూడా ఇలా గుంపులుగా చేరటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: