తెలుగు చిత్ర పరిశ్రమలో నానికి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాని అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ప్రేక్షకులు నాచురల్ స్టార్ గా మారిపోయాడు. ఇక నాని సినిమా వస్తుంది అంటే అటు ప్రేక్షకుల్లో ఒక మంచి భావన ఉంటుంది. నాని సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందని నమ్మకం ఉంటుంది. ఇక నాని సినిమా వస్తుంది అంటే అందులో నాచురల్ యాక్టింగ్ తో అదరగొడతడు  అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాని సినిమా అంటే అటు దర్శక నిర్మాతలకు కూడా మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకుని... నాచురల్ స్టార్ గా ఎంతో బాగా నటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం మొదటి సారి నా ని విలన్ గా కనిపించబోతున్నాడు. 

 

 

 ఇక ఈ సినిమాలో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. తనదైన యాక్టింగ్ తో... అద్భుతమైన ఫిట్నెస్ తో... అదిరిపోయే యాక్షన్ తో... ఇరగదీసే డ్యాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుధీర్ బాబు. ఇక ప్రస్తుతం నాని సుధీర్ బాబు కాంబినేషన్లో మల్టీ స్టారర్ గా వి అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. ఈ దర్శకుడు అంతకుముందు సుధీర్ బాబు హీరోగా  సమ్మోహనం సినిమా తెరకెక్కించి  ప్రేక్షకులందరినీ అలరించే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 

 

 అయితే  ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సుధీర్ బాబు ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా వి  సినిమాలో హీరో ఎవరు విలన్ ఎవరు అని అలీ ప్రశ్నించగా..హీరో నేను విలన్ నాని అని  సమాధానం చెప్తాడు సుధీర్ బాబు. నాకేమనిపిస్తుంది అంటే చివరికి నువ్వే విలన్ గా ఉంటావని ట్విస్ట్ ఉంటుందని అనిపిస్తుంది అంటూ సుధీర్ బాబు తో అలీ  అంటాడు. అలీ అలా అన్న సమయంలో సుధీర్ బాబు కాస్త అయోమయానికి లోనై.. పక్కాగా నాని విలన్ అని చెప్పలేక పోతాడు. ఆ ట్విస్ట్ ఏంటో మీరే చూడండి సినిమా విడుదలయ్యాక అంటూ చెప్పేస్తాడు. ఎవరు విలన్ అనేది అప్పుడే తెలుస్తుంది అంటాడు సుధీర్ బాబు. దీన్ని బట్టి చూస్తే నిజంగానే అలీ చెప్పినట్లుగా మొదటి నుంచి నాని ని  విలన్ గా చూపించి చివర్లో అసలు విలన్ సుధీర్ బాబు  అన్నట్లుగా రివీల్  చేస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: