నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పటి నుంచో కలలు కంటున్న  మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ పై క్లారిటీ లేకపోయినా దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం బాలకృష్ణ మోక్షజ్ఞ ల మల్టీస్టారర్ గురించి తన ఆలోచనలు బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. రాజమౌళి కొరటాల శివ ల తర్వాత అపజయం అన్నపదం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న ఈ క్రేజీ డైరెక్టర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి.


మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేసిన తరువాత ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సీక్వెల్ గురించి ఆలోచనలు చేస్తున్న ఈ క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హోస్ట్ చేస్తున్న ‘నీకు మాత్రమే చెప్తా’ అనే షోలో పాల్గొంటూ ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు. తాను ఎప్పటికైనా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ను డైరెక్ట్ చేయడం ఖాయం అని చెపుతూ అది తన జీవిత ధ్యేయం అని అంటున్నాడు. 


అంతేకాదు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే రోజులలో బాలకృష్ణ మోక్షజ్ఞ తో కలిసి ఉన్న ఒక ఫోటోను తన గదిలో పెట్టుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పటి నుండి తనకు మోక్షజ్ఞ అంటే ఒక విధంగా చెప్పలేని అభిమానం అంటూ కామెంట్ చేసాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మోక్షజ్ఞ తో తీసే ఆ మూవీలో బాలకృష్ణను తాత పాత్రలో చూపించాలని తన అభిప్రాయం అంటూ ఎప్పటికి నెరవేరుతుందో తెలియని తన కోరికను బయటపెట్టాడు. ఇప్పుడు ఈ న్యూస్ బాలయ్య అభిమానుల మధ్య కొత్త ఆశలను కలిగిస్తోంది. వాస్తవానికి మోక్షజ్ఞ కు సినిమాల పై అభిరుచి లేదు అంటూ వార్తలు వస్తున్న పరిస్థితులలో ఇప్పుడు అనీల్ రావిపూడి ఇలాంటి కోరికను బయట పెట్టడంతో ఎప్పటికైనా ఈ న్యూస్ నిజం కావాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: