కరోనా కారణంగా ఈ నెల 22న జనతా కర్ఫ్యూకు మోడీ పిలుపునివ్వగానే.. ప్రొవిజన్ షాపులు కిక్కిరిసిపోయాయి. లాక్ డౌన్ అని ఎనౌన్స్ చేయగానే.. కూరగాయల షాపుల వద్ద జన తాకిడి ఎక్కువైంది. కరోనా తగ్గిన తర్వాత థియేటర్స్ ఓపెన్ కాగానే.. నిర్మాతలు క్యూకడతారు. నిర్మాతలు క్యూకడతారు. వారానికి రెండు, మూడు కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడతాయి. థియేటర్స్ మాకు కావాలంటే మాకు అంటూ.. గట్టి పోటీ ఏర్పడటం ఖాయం. 

 

కరోనా ప్రభావం తగ్గగానే.. థియేటర్స్ ఓపెన్ చేయడం.. షూటింగ్స్ మొదలుపెట్టడం ఒకేసారి జరుగుతుంది. కొద్దోగొప్పో బ్యాలెన్స్ ఉన్న సినిమాలను హడావిడిగా స్టార్ట్ చేసేస్తారు. కరోనా కారణంగా రిలీజ్ కు నోచుకోలేకపోయిన సినిమాలు థియేటర్స్ లో దూకడానికి రెడీగా ఉంటాయి. ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా.. నాని వి.. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ముందుగా విడుదలవుతాయి. 

 

థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే.. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. మార్చిలో రావాల్సిన సినిమాలకు ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. రామ్ రెడ్.. అనుష్క నిశ్శబ్దం.. వైష్ణవ్ తేజ్ ఉప్పెన ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. థియేటర్స్ తెరవగానే.. మార్చి.. ఏప్రిల్ సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకి వస్తాయి. ఈ హెడ్ కాంపిటీషన్ లో థియేటర్స్ కొరత ఏర్పడుతుంది. 

 

ఇక మేలో రిలీజ్ కావాల్సిన సినిమాల విషయానికొస్తే.. వకీల్ సాబ్.. క్రాక్ సినిమాల షూటింగ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. వీటి షూటింగ్స్ మొదలు కాగానే.. మార్చి.. ఏప్రిల్ సినిమాలన్నీ రిలీజ్ అయ్యేలోగా.. మే సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతాయి. కరోనా ప్రభావం ఇంకెంత కాలం ఉంటుందో.. ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక్క కేసుకూడా నమోదు కాలేదనుకుంటేనే.. పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు. అది ఎప్పుడొస్తుందో తెలియదు. కరోనా సమస్య తీరగానే.. తెలుగు సినిమా రిలీజ్ ప్రాబ్లమ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: