తెలుగు చిత్ర పరిశ్రమలో సుధీర్ బాబు అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సుధీర్ బాబు సినిమా వస్తుంది అంటే అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది అని ప్రేక్షకుడి భావన. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన సుధీర్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. తనదైన యాక్టింగ్ తో అదరగొడుతునే.. అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు సుధీర్ బాబు. అంతేకాకుండా ఫిట్నెస్ విషయంలో కూడా అందరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటాడు. ఎప్పుడు సిక్స్ ప్యాక్ తో  అదిరిపోయే ఫిట్నెస్ తో  అందరినీ మెస్మరైస్  చేస్తూ ఉంటాడు సుధీర్ బాబు. ఎస్ఎంఎస్  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సుధీర్ బాబు మొదటి సినిమాలోనే డాన్స్ లతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శమంతకమణి సినిమా లో మంచి గుర్తింపు సంపాదించాడు. ఇక ప్రేమ కథా చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపులు ఆకర్షించాడు. 

 

 

 ఇలా వరుస సినిమాలతో మాస్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైనా  సుధీర్ బాబు సమ్మోహనం సినిమాతో తన నటనతో కూడా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు క్లాస్ ప్రేక్షకులకు కూడా  దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత తన ఫిట్ నెస్ తో  అందరినీ ఆశ్చర్యపరిచిన సుధీర్ బాబు ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసి భాగీ  సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా సుధీర్ బాబు కు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు వి  సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తుండగా సుధీర్ బాబు  హీరో పాత్రలో నటిస్తున్నారు. 

 

 

 ఈ సినిమా ఇంకొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ బాబు  అలీ  వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు సుధీర్ బాబు. తాను హీరోగా  ఎస్ఎంఎస్ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో... పక్కనే ఉన్న టీ కొట్టులో ప్రతి రోజూ వెళ్లి టీ తాగే వాడిని.. బిస్కెట్లు కూడా అక్కడి నుంచి తెచ్చుకునే వాడిని... అప్పుడు తన పొజిషన్ ఆర్థికంగా కాస్త టైట్ గా ఉంది... ఇక టీ కొట్టులో బాకీ కాస్త ఎక్కువ అవడంతో ఓ  రోజు టీ కొట్టు వ్యక్తి వచ్చి బాకీ  అడగడంతో.. ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో... తనకు ఎంతో సెంటిమెంట్ అయినా సుధీర్ బాబు మామయ్య గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ను  తాకట్టు పెట్టేందుకు సుధీర్ బాబు సిద్ధ పడ్డాడట. దీంతో అదే ఏం వద్దులే సార్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అంటూ టీ కొట్టు వ్యక్తి చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: