ఈ మద్య అన్ని సినీ పరిశ్రమల్లో రిమేక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  మంచి కంటెంట్ లో ఓ సినిమా హిట్ అయితే దాన్ని ఇతర భాషల్లోకి తమ నేటివిటీకి తగ్గట్టుగా రిమేక్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో పింక్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దాన్ని తమిళ్ లో రిమేక్ గా స్టార్ హీరో అజిత్ నటించాడు.  ప్రస్తుతం తెలుగు లో పవన్ కళ్యాన్ ‘వకీల్ సాబ్’ రిమేక్ గా వస్తుంది.  తమిళంలో స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ బ్లాక్ బస్టర్ అయ్యింది.  ఈ మూవీ ఏకంగా రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది.  ఇందులో ద్విపాత్రాభినయంలో నటించాడు ధనుష్.  

 

తాజాగా  కథాకథనాల పరంగా .. కథానాయకుడి లుక్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ మూవీని తెలుగు లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ గా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.   తాజాగా ఈ మూవీ కన్నడ లో కూడా రిమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

అయితే హీరోగా కన్నడ సూపర్ స్టార్ శివకుమార్ అయితే బాగుంటుందని భావించారట.  ఆ మద్య రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కిల్లర్ వీరప్పన్ ’మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో శివ కుమార్ దుమ్మురేపారు.  ఆయన నటించిన కొన్ని సినిమలు తెలుగు కూడా డబ్ అయ్యాయి.  జాకబ్ దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ మరి ఈ ఇద్దరు హీరోలకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: