తెలుగు ఇండస్ట్రీలో ఉయ్యాల జంపాల చిత్రంతో బుల్లితెర నటి  అవికా గోర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  బుల్లితెరపై వచ్చిన చిన్నారి పెళ్లి కూతురు సిరియల్ తో నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఎంతో పాపులారిటీ సంపాదించింది.  తర్వాత బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత తెలుగు లో ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత  ‘సినిమా చూపిస్తమావ'తో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మాయి, తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన తెలుగులో గ్యాప్ తీసుకుంది. ఈ అమ్మడు కాస్త బొద్దుగా తయారు కావడం వల్లో మూవీ ఛాన్సులు మిస్సయ్యిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి.

 

ఇటీవల కాలంలో తన ఫిట్ నెస్ పై దృష్టి కేంద్రీకరించిన అవికా కాస్త స్లిమ్ గానే అయ్యింది.  దానికి సంబంధించిన ఫోటో షూట్స్ ఆ మద్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  అంతే కాదు ఆ మద్య యాంకర్, డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది 3 లో నటించిన విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో అశ్విన్ బాబు సరసన అవికా గోర్ నటించింది. కాకపోతే ఈ చిత్రం అనకున్నంత విజయం సాధించలేకపోయింది.  ఇదిలా ఉంటే మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో పరిచయం అయ్యాడు.  

 

ఆ చిత్రం పెద్దగా హిట్ కాలేదు. తాజాగా  ‘సూపర్ మచ్చి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  ఆ తరు వాత సినిమాగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ అవికా గోర్ ను తీసుకున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. మరి ఈ చిత్రంతో ఇద్దరికీ ఎంత వరకు పేరు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: