ఈ మద్య టాలీవుడ్ లోకి మాలీవుడ్, కోలీవుడ్ బ్యూటీలు హీరోయిన్లుగా వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా అమృత అయ్యర్.. యాంకర్ ప్రదీప్ హీరోగా చేస్తోన్న '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవ్వనుంది. ఆ మద్య విజయ్ హీరోగా నటించిన బిగిల్ తెలుగు లో విజిల్ మూవీలో కెప్టెన్ థెండ్రాల్ పాత్రలో కనిపించింది. ఇక  '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'  రిలీజ్ కాకముందే హీరో రామ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ‘రెడ్’ మూవీలో నటిస్తుంది.  ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. రెడ్‌ను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయనుండగా స్రవంతి మూవీస్ బ్యానర్ మీద స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు.

 

ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎప్రిల్ 9న విడుదలకానుంది.  వీటితో పాటు మరో రెండు తెలుగు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  త్వరలో ఇవి సెట్స్ పైకి వెళ్తాయి  .ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా కెరియర్ లో తన జర్నీ గురించి అమృత షేర్ చేసుకుంది. నేను సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చాను.. మా కుటుంబంలో హీరోయిన్ గా రావడం అనేదంటూ ఉంటే అది నేను అన్నారు. అయితే బిగిల్ లో చిన్న పాత్రలో కనిపించి.. ఒకటీ రెండు మూవీస్ తో సరిపెట్టుకోవాలని చూశాను.  కానీ నాకు అదృష్టం కొద్ది హీరోయిన్ గా వరుస ఛాన్సులు వస్తున్నాయి.  

 

గ్లామర్ ఫీల్డ్ అనే విషయం నాకు తెలుసు.  నా వరకూ హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపించేంతవరకూ అయితే ఓకే.అంతకుమించి అంటే నా వల్ల కాదు అని తన మనసులోని మాటను చెప్పేసింది. ఈ మద్య గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్లు ఎక్కువయ్యారు.. నటనకు ప్రాధాన్య ఇచ్చేవారు తక్కువైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వడం నిజంగా గొప్పతనమే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: