ఆయన పేరు చెప్తే చాలు అమ్మాయిలకు పిచ్చి. ఆయన సినిమాలు చూస్తూ సినీ అతని మీద ఇష్టంతో సినీ పరిశ్రలోకి వచ్చిన వారు ఉన్నారు. ఆయన మరో కాదండి హీరో సూర్య. సూర్య తమిళ అగ్రస్థాయి హీరోలో ఒక్కరు. అంతే కాదు మంచి కమిట్ మెంట్ ఉన్న హీరో. సినిమాలోకి వచ్చిన తొలి రోజుల్లో హీరో అవగలనా అనుకున్నాయనే ఇప్పుడు సూపర్ స్టార్ హీరోగా ఎదిగారు. సూర్య అటు తమిళంలోను ఇటు తెలుగులోను మంచి క్రేజీ ఉన్న హీరో.

 

ప్రస్తుతం తమిళ హీరో సూర్య సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేస్తున్నారు. సూర్య తమిళంలో సూరారై పోట్రు అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేయాలని చేస్తున్నారు.

 

తెలుగులో ఆకాశం నీ హద్దురా’ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి మలయాళీ నటి అపర్ణ బాలమురలి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతోంది.

 

ఈ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న నటిస్తున్నారు. ఆకాశం నీ హద్దురా సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమైయ్యారు.

 

సూర్య తన 39వ చిత్రాన్ని హరి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా అనంతరం సూర్య శివ దర్శకత్వంలో నటించనున్నారు. సూర్య ఈ రెండు సినిమాలు పూర్తీ చేసిన తర్వాత ఆయన మళ్లీ ఓ బయోపిక్‌లో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. 

 

ఈ సినిమాకి కూటత్తిల్‌ ఒరుత్తన్‌ ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దీనికి సంబంధించిన కథను ఇటీవలే సూర్య విన్నారని టాక్. అంతేకాదు సూర్యకు కథ నచ్చడంతో వెంటనే ఆయన అంగీకరించునట్లుగా సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: