కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజానీకం చప్పట్లతో సంఘీభావం తెలిసింది. సాయంత్రం 5 గంటలకు అందరూ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు, అధికారులు, కార్మికులు, పోలీసులందరికీ కరతాళ ధ్వనులతో తమ మద్దతు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఇంక సెలెబ్రెటీల మాట చెప్పక్కర్లేదు. టాలీవుడ్ మొత్తం జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపి తమ ఐక్యత చాటుకున్నారు.

 

చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మొదలయిన టాలీవుడ్ ప్రముఖులంతా చప్పట్లతో తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ వీడియోస్ పోస్ట్ చేసారు. హీరోయిన్లు, డైరెక్టర్లు కూడా చప్పట్లతో వీడియోలను పోస్ట్ చేస్తూ సంఘీభావం తెలిపారు. మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ మద్ధతు ప్రకటించారు. అయితే  ఈ సందర్భంగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేసిన ఫోటో అందర్నీ ఆకర్షిస్తోంది.



సామాజిక అంశాలపై స్పందించడానికి ఎప్పుడూ ముందుండే సాయి ధరమ్ తేజ్ మరోసారి కరోనా నేపథ్యంలో స్పందించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మనకి సేవ చేసిన రియల్ హీరోస్ కు కృతజ్ఞతలు తెలిపే టైం వచ్చిందంటూ పోస్ట్ పెట్టాడు. మన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిర్విరామంగా కృషి చేస్తున్న డాక్టర్స్ కి, పోలీసులకు, నర్సులకు మరియు మీడియా ప్రతినిధులకు సంఘీభావం తెలిపారు. అంతే కాకుండా హీరోస్ అంటే అరచేతులు అడ్డుపెట్టి బుల్లెట్స్ ని ఆపాల్సిన అవసరం లేదని, బూట్లు ధరించి బిల్డింగులు ఎక్కాల్సిన పని లేదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా, ఈ మధ్యే దేవకట్టా డైరెక్షన్ లో ఒక మూవీని పట్టాలెక్కించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: