హీరోయిన్లు జనరల్ గానే ఫిట్ నెస్ ఫ్రీక్స్ గా ఉంటారు. స్క్రీన్ మీద స్లిమ్ గా కనిపించడం కోసం నోరు కట్టేసుకుని నానా కష్టాలు పడుతుంటారు.  బాలీవుడ్ అయినా.. టాలీవుడ్ అయినా.. హీరోయిన్ స్లిమ్ గా ఉండడం మాత్రం ఇప్పుడు మాండేటరీ అయిపోయింది. అందుకే ఆ వర్క అవుట్లనే  ఇంకాస్త గ్లామరస్ చేస్తున్నారు హీరోయిన్లు.

 

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. అసలు ఏమాత్రం మిస్ అవ్వకుండా వర్క్ అవుట్స్‌ చేస్తుంది. ఫిట్ నెస్ తో పాటు .. తన వర్కవుట్ డ్రెస్సింగ్ కూడా అంతే ట్రెండీగా ఉండేలా చూసుకుంటుంది. అయినా.. జిమ్ చేసేటప్పుడు డ్రెస్ కంఫర్టబుల్ గా, కన్వీనియెంట్ గా ఉండాలి అంటోంది. అందుకే తన డ్రెస్సింగ్ లో  ఏమాత్రం ఛేంజెస్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ తో జిమ్ లోనూ సెగలు పుట్టిస్తోంది.

 

బాలీవుడ్ లో మరో స్లిమ్ బ్యూటీ దిశా పఠానీ కూడా.. తన  స్లీక్ ఫిగర్ తో పాటు జిమ్ వేర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఎప్పటి కప్పుడు హాట్ సాంగ్స్ తో తన వర్కవుట్ బాడీని ఎక్స్ పోజ్ చేస్తూ దిశా.. స్టంట్స్ , వర్కవుట్స్ చేస్తూ...ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్ ని తెగ ఖుషీ చేస్తోంది.

 

స్టార్ హీరోయిన్ దీపికా కూడా తన ఫిజిక్ ని మెయింటెన్ చెయ్యడానికి కంపల్సరీగా కసరత్తులు చేస్తుంది. బట్.. తన అటైర్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. కంఫర్టబుల్ టాప్స్ తో కూల్ గా తన వర్క్‌ అవుట్ చేస్తుంది దీపికా. పెద్దగా అటెన్షన్  ఎక్స్ పెక్ట్ చెయ్యని దీపికా.. ఈ మద్య లుంగీ డ్యాన్స్ చేస్తూ..తన ఓన్ స్టైల్లోనే ఫ్యాన్స్ ని  తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.  స్టార్టింగ్ లో చాలా హెవీ వెయిట్ తో ఉన్న వెరీ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా  ఫ్యాషన్ స్టేట్ మెంట్స్ ఇవ్వకుండా తనకు నచ్చిన డ్రెస్ తో జిమ్ చేస్తూ ఫిజిక్ ని మెయింటెన్ చేస్తోంది. సింపుల్ వర్కవుట్స్ తో వెరీ సింపుల్ జిమ్ వేర్ తో తన వర్కవుట్స్  కంటిన్యూ చేస్తోంది. 


తెలుగు హీరోయిన్లలో ఫిట్ నెస్ ఫ్రీక్ అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు రకుల్ ప్రీత్ సింగ్.  వర్కవుట్ జస్ట్ స్టైల్ కోసం కాకుండా కంఫర్టబిలిటీ చూస్కోవాలని  సింపుల్ టిప్స్ కూడా చెబుతోంది రకుల్. వెయిట్స్ తో పాటు స్ట్రెచింగ్ , కార్డియో ఇలా అన్ని రకాల వర్క్‌ అవుట్స్ ని  చేస్తూ.. ఇప్పటి హీరోయిన్లు అందరికీ రోల్ మోడల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: