బుల్లితెర నుంచి ప‌రిచ‌య‌మైన అవికాగోర్ `చిన్నారి పెళ్ళికూతురు` సీరియ‌ల్‌తో ప‌రిచ‌య‌మైన ఈ భామ ఉయ్యాలా జంపాలా చిత్రంతో సూప‌ర్‌డూప‌ర్ హిట్ కొట్టింది. ఆ చిత్రంతో యూత్‌ని ఆక‌ట్టుకుంది ఈ భామ‌. ఆ త‌ర్వాత `సినిమా చూపిస్త‌మామ‌`తో మ‌రో హిట్ కొట్టింది కానీ ఈ చిత్రంలో కాస్త లావుగా క‌నిపించింది. దాంతో కొంత అవ‌కాశాలు త‌గ్గాయి. తెలుగులో ఒక రేంజ్‌లో దూసుకుపోతుంద‌ని అనుకున్నారు కానీ చాలా గ్యాప్ వ‌చ్చేసింది.

 

అలా 'రాజుగారి గది 3' చేసిన అవికా, చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తో జోడీగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి ఈ భామ‌కి మెగా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని చెప్పాలి. ఉన్న‌ట్టుండి మంచి ఆఫ‌రే కొట్టింది ఈ భామ‌. 'విజేత' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కల్యాణ్ దేవ్, 'సూపర్ మచ్చి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఆ తరువాత సినిమాగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం అవికా గోర్ ను తీసుకున్నార‌ని స‌మాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.

 

ఇక ఈ సినిమాతోనైనా అవికా మ‌ళ్ళీ తెలుగు ఇండ‌స్ట్రీలో పుంచుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి. ఇక క‌ల్యాణ్‌దేవ్ కూడా ఈ చిత్రంతో ఓ రేంజ్‌లోకి రావాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ కోరుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోలంద‌రూ దాదాపుగా ఒక రేంజ్‌లో ఉన్న‌వారే కేవ‌లం ఒక్క క‌ల్యాణ్‌దేవ్ ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్ వీరిద్ద‌రూ మాత్రం ఇంకా ఫామ్‌లోకి రాలేదు. వీరిద్ద‌రికి ఫామ్‌లోకి రావాలంటే కొంత టైమ్ ప‌ట్టేలా ఉంది. చూద్దాం మ‌రి వీరి ద‌శ ఎప్పుడు తిరుగుతుంది అన్న‌ది. వైష్ణ‌వ్ తేజ్ కంటే ముందు క‌ల్యాణ్‌దేవ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు కాబ‌ట్టి త‌ను క‌థ‌లు ఎంచుకోవ‌డంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఎంచుకుంటూ ఆచి తూచి డిఫ‌రెంట్ స్టోరీస్ చేసుకుంటూ వ‌స్తే ఫామ్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. వ‌రుణ్‌తేజ్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త స్టోరీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. అలాగే ప్ర‌స్తుతం అంద‌రూ హీరో క‌న్నా కూడా క‌థ‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబ‌ట్టి క‌థ‌లు ఎన్నుకునే విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటే బావుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: