కరోనా వల్ల ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఈనెల 31 వరకు లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కరోనా నిర్ములనకు తన వంతు బాధ్యత గా హీరో నితిన్ నిన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 20 లక్షల విరాళం ప్రకటించాడు. అందులోభాగంగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి నితిన్.. 10లక్షల చెక్ ను అందించాడు. ఈ సందర్బంగా నితిన్ ను కేసీఆర్ అభినందించారు.
 
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యత తో ముందుకొచ్చి విరాళం ప్రకటించడం గొప్ప విషయం అని కేసీఆర్, నితిన్ ను ప్రశంసించారు. అలాగే నితిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కూడా కలిసి 10లక్షల రూపాయల చెక్ ను అందించనున్నాడు. అయితే టాలీవుడ్ నుండి ఇప్పటివరకు ఒక్క నితిన్ తప్ప మిగితా హీరోలు ఎవరు విరాళాలు ప్రకటించలేదు. నితిన్ చేసిన ఈ పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. 
 
ఇదిలావుంటే గతకొంత కాలంగా పరాజయాలతో సతమతమైన నితిన్ ఎట్టకేలకు ఇటీవల భీష్మ తో వచ్చి హిట్ కొట్టాడు. ఇక నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి .. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగ్ దే కాగా  సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చెక్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. రంగ్ దే షూటింగ్ తుది దశకు చేరుకోగా చెక్ కూడా సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. ఈసినిమాల తరువాత నితిన్, అంధధూన్ రీమేక్ లో నటించనున్నాడు.మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్నఈ చిత్రం జూన్  నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈమూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదలకానున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: