తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రాల్లో మంచి పేరు తీసుకు వచ్చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’.  ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించారు.  ఇందులో ఓ పాత్ర బంగార్రాజు.. ఇది కామెడీ, పవర్ ఫుల్ పాత్ర కావడంతో ఈ పాత్రకు ఎంతో మంచి పేరు వచ్చింది.  మరోపాత్ర డాక్టర్ గా చాలా అమాయకంగా నటించారు.  ఈ చిత్రం తర్వాత సీక్వెల్ ఉంటుందని అనుకున్నారు.  ఆ మద్య సీక్వెల్ రాబోతుందని కూడా చెప్పారు.  కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక బంగార్రాజు కి అంతా కుదిరి సెట్స్ పైకి వెళ్తుందీ అన్న సమయంలో ఇప్పుడు కరోనా కష్టాలు వచ్చి పడ్డాయి.

 

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తుండటంతో, ఏప్రిల్ 2వ వారంలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.  ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.  కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ వాయిదా వేస్తున్నట్టు స్వయంగా చిరంజీవి తెలిపారు.  ఇదే బాటలో పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, నాని, అఖిల్ మూవీ షూటింగ్స్ సైతం వాయిదా వేశారు. 

 

అన్నీ అనుకూలిస్తే త్వరలో షూటింగ్ మొదలు పెట్టే యోచనలో ఉన్నారు.  ఇ ప్పటికే వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన 'బంగార్రాజు' .. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడనుందన్న మాట. రమ్యకృష్ణ .. చైతూ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.  మరి ఈ చిత్రంలో నాగార్జునను ఎలా చూపించబోతున్నారో అన్న ఉత్సాహంలో అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయంలో కరోనా మహమ్మారి వాయిదా వేయించిందంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: