మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న అభిమానుల‌కు ఉగాది కానుక ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండుగ‌ను పురస్కరించుకొని అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు సోష‌ల్ మీడియాలోకి అడుగుపెడుతున్న‌ట్లు తెలిపారు. తన అభిప్రాయాలను మరింత బలంగా వినిపించడం కోస‌మే ష‌డ్రుచుల‌ను పంచే ఉగాది పండుగ‌ నుంచి  సోషల్ మీడియాలోకి ఎంటర్‌ అవుతున్నానని ప్రకటించారు. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అంద‌రూ హీరోలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ చాన‌ల్‌, ట్విట్ట‌ర్ ఇలా ఒక్కోరు ఒక్కో వేదిక‌ను ఎక్కువ‌గా వాడుతుంటారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్‌ను ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు.

 

ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న సినీ,రాజ‌కీయాలకు సంబంధించిన అంశాలపై త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. నాగ‌బాబు గారైతే యూట్యూబ్ చాన‌ల్ ఓపెన్ చేసి అప్ప‌ట్లో తెగ హ‌డావుడి చేశారు. మిగ‌తా హీరోలైన బ‌న్నీ, చెర్రీ, వ‌రుణ్‌తేజ్‌లు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ల‌ను వాడుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మెగాఫ్యామిలీకి పునాది రాయి అయిన అన్న‌య్య ఆల‌స్యంగానైనా సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇస్తుండ‌టం ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. అయితే ట్విట్ట‌ర్ ద్వారానే చిరు త‌న అభిప్రాయాల‌ను అభిమానుల‌తో పంచుకోనున్నార‌ని, రాష్ట్ర రాజ‌కీయాల‌పైనా స్పందించాల‌నే ఉద్దేశంతోనే ఆయ‌న సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుతున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

అయితే ఖాతా ఓపెన్ చేసి వాడ‌కుండా ఉండ‌టం అనేది త‌న‌కు ఇష్టం లేద‌ని, అక్టివ్‌గా ఉండాల‌ని స్ట్రాంగ్‌గా ఫిక్స‌య్యాకే ఎంట్రీ ఇస్తున్న‌ట్లు స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకున్నార‌ట‌. చూడాలి మ‌రి మెగాస్టార్ సోష‌ల్ మీడియాలో కూడా మెగాస్టార్‌గా నిలుస్తారో లేదో..?| కాగా, చిరంజీవి ప్రస్తుతం ‘ ఆచార్య’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇంట్లో కుటుంబ‌స‌భ్యుల‌తో విశ్రాంతి తీస‌కుంటున్నారు. క‌రోనా వైర‌స్‌ను నివారించాల‌ని చిరంజీవి చేసిన ఓ ప్ర‌క‌ట‌న ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో బాగా చ‌క్క‌ర్లు కొడుతుండ‌టం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: