కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దేశంలోని ప్రజలు.  ఇప్పటికే లాక్ డౌన్ తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దాంతో సామాన్యులకు కష్టాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజులు ఇంటి పట్టున ఉండాలంటే.. రోజు వారి పనులు చేసుకునే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు ప్రభుత్వం సాయం చేస్తామని చెబుతున్నా అది అమలు అయ్యేసరికి సమయం పడుతుంది. ఇదిలా ఉంటే సినీ పరిశ్రమను ఆదుకునేందుకు కొంత మంది నటులు ముందుకు వస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని సామాన్యులు.. పెదవారు ఉన్నారు. వారికి నిత్యావసర వస్తువుల విషయంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ సమయంలో కొంతమంది నటులు, నాయకులు, క్రీడాకారులు ముందుకు వచ్చి వారికి తోచిన సహాయాన్ని అందిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు శివాజీరాజా తమ మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల మా అసోసియేషన్ సందర్భంగా శివాజీరాజా పేరు సోషల్ మీడియాలో బాగా వినిపించిన విషయం తెలిసిందే.  నటుడిగా ఎన్నో సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నశివాజీరాజా తాజాగా ఆయన తోటలో పండించిన కూరగాయలు పేద కళాకారులకు పంచేందుకు ముందుకు వచ్చారు.  మా అసోయేషన్ లో పనిచేసే సమయంలో కూడా ఆయన పేద కళాకారుల విషయంలో ఎంతో శ్రద్ద తీసుకునేవారని అంటారు.

 

శివాజీరాజాకు హైదరాబాదు శివార్లలోని మొయినాబాద్ లో వ్యవసాయక్షేత్రం ఉంది. అందులో రకరకాల కూరగాయలను, ఆకుకూరలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు. చిత్ర పరిశ్రమ స్థంభించిపోవడంతో  శివాజీరాజా తన ఫార్మ్ హౌస్ లోనే కాలం గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పొలంలోని కూరగాయలను పేద కళాకారులకు పంపిస్తున్నారు.  అంతేకాదు, స్టే హోం చాలెంజ్ లో భాగంగా తన మిత్రులు హీరో శ్రీకాంత్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ, ఉత్తేజ్, దర్శకుడు కృష్ణవంశీలకు సవాల్ విసిరారు.  శివాజీరాజా మాట్లాడుతూ, అవసరమైన వారికి బియ్యం, పప్పు తదితర నిత్యావసర సరుకులను కూడా పంపిస్తానని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తనకు సమాచారం అందించాలని సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: