సాధారణంగా యువ హీరోలు సీనియర్ దర్శకులతో సినిమాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. దర్శకుడు ఏ విధంగా చెప్తే వాళ్ళు ఆ విధంగా వింటూ సినిమాను ముందుకి నడిపించే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాని యువ హీరో విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఇది ఎక్కడా జరగడం లేదు అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా బాబు మీద మాత్రం కొందరు చాలా ఆగ్రహంగా ఉన్నారు అనేది ఇప్పుడు అర్ధమవుతుంది. 

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్ గా ఫైటర్ అని అనుకుంటున్నారు. ఇది మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. త్వరలోనే ఈ టైటిల్ ని ఖరారు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే కథలో విజయ్ దేవరకొండ వేలు పెడుతున్నాడట. 

 

వాస్తవానికి ఇందులో లవ్ సీన్స్ ఎక్కువగా వద్దు అనేది పూరి భావన. కాని విజయ్ మాత్రం అవి ఎక్కువగా ఉండే విధంగా చూడాలని పూరికి సలహాలు ఇవ్వడంతో పూరి చాలా సీరియస్ గా ఉన్నాడు. తనకు నచ్చినట్టు సినిమా చెయ్యాలని ఇది అంత మంచిది కాదని హీరో కి తగిన విధంగానే కథ రాసుకుంటాం గాని ఇలా కాదని తనకు నచ్చిన విధంగా షూట్ చేస్తా అని కాస్త ఘాటుగా చెప్పినట్టు సమాచారం. విజయ్ వైఖరి మీద నిర్మాతకు కూడా పూరి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దర్శకుడు నేనా అతనా అని అడిగినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: