తెలుగు ఇండస్ట్రీలో కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ఇంటికే పరిమితం అయ్యింది.  ఇటీవల భారతీయుడు 2 చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు.  పది మంది గాయపడ్డారు... ఇదో పెద్ద ఇష్యూ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సీబీ సీఐడీ ముందు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ హాజరైన విషయం తెలిసిందే.  కాజల్ కి కూడా నోటీసులు పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా సినీ నటులు ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఒక్కొక్కరూ ఒక్కో పద్దతిలో టైంపాస్ చేస్తున్నారు. కరోనా కారణంగా షూటింగులన్నీ కూడా కేన్సిల్ అయ్యాయి. దాంతో తారలంతా కూడా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. 

 

 

అయితే కరోనా కారణంగా తాను ఇంటి పట్టున ఉన్నప్పటికీ, సమయాన్ని వృథా చేయడం లేదని కాజల్ చెప్పింది.  అలా ప్రస్తుత పరిస్థిలోతుల్లో తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని అంది. సమయాన్ని వృథా చేయడం లేదనే సంతృప్తితో  రోజులు గడుస్తున్నాయని చెప్పుకొచ్చింది. తాను నేర్చుకునేది జీవితంలో ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయాన్ని గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని అంది. తన మనసుకి నచ్చిన పనులను చేస్తూ వెళతాననీ, అప్పుడే తనకి సంతోషంగా అనిపిస్తూ ఉంటుందని చెప్పింది. 

 

 

ఇక ఇతర సినీ నటులు ఇంట్లో వంటలు వండటం.. చెట్లు సంరక్షణ చేయడం.. బొమ్మలు వేయడం.. మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం.. ఇతర వ్యాయామాలు చేయడం లాంటివి చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో కాజల్ మాత్రం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే భవిష్యత్ లో ఏదైనా చిత్రానికోసం ఈ ప్రాక్టీస్ చేస్తుందా అన్న విషయం పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: