బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ . తన సినిమాలో ఒక హీరో ఉంటేనే అద్భుతాలు సృష్టించే రాజమౌళి ఇద్దరు సూపర్ స్టార్స్ తో చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. సినిమా కథ కూడా ఇద్దరు రియల్ హీరోస్ కథతో రాసుకున్నారని తెలిసి ఆడియెన్స్ లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఆర్.ఆర్.ఆర్ అబ్రివేషన్ ఏంటి.. ఆర్.ఆర్.ఆర్ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఎప్పుడు. సినిమా నుండి గాసిప్స్ రావడమే కాదు అఫీషియల్ గా చిత్రయూనిట్ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. అలాంటి వాళ్లందరికీ సార్ ప్రయిజ్ ఇస్తూ ఉగాదికి కానుక ఇస్తున్నాడు రాజమౌళి. 

 

ఈ ఉగాదికి ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారని ఎనౌన్స్ చేశారు. ఈ ఎనౌన్స్ మెంట్ తో వచ్చిన పోస్టర్ కూడా అద్భుతంగా ఉంది. ఇంతకీ ఆ పోస్టర్ లో ఏముంది అంటే రెండు చేతులు కనిపించగా ఒక చేయి నీరు.. మరో చేయి నిప్పుతో చూపించారు. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ గురించి ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఇదో గొప్ప కానుక కానుంది. అయితే ప్రస్తుతం కరోనా వల్ల ఉగాది కూడా జరుపుకునే పరిస్థితులు కనబడటం లేదు. అందుకే ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ తో పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. 

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఈ సినిమాకు ప్రాణం పెడుతున్నట్టు తెలుస్తుంది. బుధవారంఉగాది సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు రాజమౌళి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా బాహుబలి రేంజ్ కాదు కాదు అంతకుమించి సంచలనాలు సృష్టించేలా రాజమౌళి ప్లాన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: