భారత దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం యొక్క అప్డేట్ కోసం మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు తెరకెక్కనుంది. బాహుబలి రెండు భాగాలను తీసేందుకు రాజమౌళి ఐదు సంవత్సరాల సమయం తీసుకోగా ఈ చిత్రాన్ని తీసేందుకు ఎంత కాలం వెయిట్ చేయిస్తాడు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ అప్డేట్ కోసం హీరో ఫ్యాన్స్ తో పాటు తెలుగు అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు.

 

డీవివి నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు ఉగాది పర్వదిన సందర్భంగా వారి చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషించనున్నాడు. బాలీవుడ్ స్టార్ తారాగణం అజయ్ దేవగన్ మరియు ఆలియా భట్ తో పాటు మరొక హాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో ఉండడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

 

ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు. దాదాపు వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేపు విడుదల కాబోయే టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ ఎలా ఉండబోతుంది అని అప్పుడే నెటిజన్లు సోషల్ మీడియాలో తమ సొంత ఎడిట్లతో హల్ చల్ చేస్తూ ఉండగా ఇక ఈ చిత్రం యొక్క మొదటి అప్డేట్ ఏ సమయానికి వస్తుంది అన్న విషయం మాత్రం ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: