వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా అడుగుపెట్టడం అనేది ఒకప్పుడు మాత్రం ఒకింత కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో కొంచెం ఇళ్లలో కట్టుబాట్లు ఎక్కువ ఉడడంతో పాటు ఎక్కువగా ఆడవారు బయటకు వచ్చి ఇటువంటి రంగంలో నిలబడడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదని, అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా తయారయ్యాయని, అందునా ఆడవారు అన్ని రంగాల్లో ముందుండడంతో పాటు సినిమా రంగంలో కూడా ఒకప్పటితో పోలిస్తే మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తున్నారని అంటున్నారు సినీ విశ్లేషకులు. వాస్తవానికి ఒకప్పుడు కూడా ఎందరో గొప్ప నటీమణులు సినిమాల్లోకి వచ్చి మంచి పేరు దక్కించుకున్న వారు ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నటిగా ప్రవేశించడం తేలికే, కాకపోతే నిలదొక్కుకోవడం కష్టం. 

 

అయితే హీరోయిన్ గా తమ కెరీర్ ముగిసిన అనంతరం, ఎక్కువగా హీరోయిన్లు ఎవరికి వారు పెళ్లిళ్లు చేసుకుని తమ కుటంబ బాధ్యతల్లో మునగడంతో, తమ రూపు రేఖలను పెద్దగా పట్టించుకోరు అనే చెప్పాలి. ఇక ఇటీవల హీరోయిన్లుగా అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకున్న కొందరు హీరోయిన్ల లో ఒకరిద్దరు హీరోయిన్లు ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడప్పటికీ కూడా, తమ అందాన్ని, అలానే ఫిజిక్ ని మాత్రం ఇంకా అదే రీతిన కొనసాగిస్తుండడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇష్టం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీయ శరణ్, ఆపై మెల్లగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఒక్కొక్కటిగా టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకున్నారు. అనంతరం మంచి హిట్స్ అందుకున్న శ్రీయ, ఆపై పలువురు అగ్ర నటుల సరసన నటించి మంచి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్నారు. 

 

ఇటీవల శ్రియ తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చివ్‌ను పెళ్లి చేసుకోవడంతో సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం అక్కడక్కడా మాత్రమే ఆమె నటిస్తున్నారు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో శ్రీయ పెడుతున్న ఫోటోలు, వీడియోలను చూసి, ఆమెకు పెళ్ళై, నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నప్పటికీ కూడా మొదటి నుండి అదే విధమైన అందం, ఫిజిక్ ని మెయింటెయిన్ చేస్తున్నారని, ఏజ్ బార్ అనేది ఆమెకు ఒక సంఖ్య మాత్రమే అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: