ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది మహమ్మారి కరోనా. ఇప్పటికే చైనా సహా మరికొన్ని దేశాల్లో భారీగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతుండడంతో అక్కడి ప్రభుత్వాలు కఠినంగా నిర్ణయాలు తీసుకుని లాకౌట్ వంటివి గట్టిగా పాటిస్తూ, వ్యాధిని మరింతగా వ్యాప్తి కాకుండా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మన దేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలను ఇంటి వద్దనే ఉండి, ఈ మహమ్మారి మరింతగా వ్యాప్తం కాకుండా చర్యలు తీసుకోమని అభ్యర్ధించిన విషయం తెలిసిందే. అలానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాని సూచన మేరకు పూర్తిగా లాకౌట్ అమలు చేస్తున్నారు. 

 

అయితే మధ్య మధ్యలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు వీటిని పెద్దగా లక్ష్య పెట్టకుండా బయటకు వస్తుండడంతో పోలీసులకు అది కొంత తలనొప్పిగా మారింది. పలు జిల్లాల్లోని పోలీసులు, కలెక్టర్లు ఈ విషయమై మరింతగా అలెర్ట్ గా వ్యవహరించి ప్రజలు బయటకు రాకుండా నిరోధించే చర్యలు చేపడుతున్నారు. కానీ కొందరు మాత్రం వారి అభ్యర్ధనను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా బయటకు వస్తున్నారని కొందరు అధికారులు అధికారులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజలందరి రక్షణ కోసం చేపట్టిన కార్యక్రమం అని, కేవలం మరికొద్దిరోజులు ఎవరికి వారు స్వచ్ఛందంగా తమ తమ ఇళ్లకు పరిమితం అయితే ఈ మహమ్మారిని సులువుగా తరిమికొట్టవచ్చని వారు అంటున్నారు. 

 

ఇకపోతే ఈ విధంగా కొందరు ప్రజలు ప్రభుత్వ సూచనలను లక్ష్య పెట్టకుండా వ్యవహరిస్తుండడంతో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మనం చేతులను శ్యానిటైజ్ చేసుకుంటే, రూల్స్ ని అతిక్రమించిన వారిని అదుపులో పెట్టడానికి పోలీసులు తమ లాఠీలకు శ్యానిటైజ్ చేస్తున్న వీడియోని నిన్న తన అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఇక రేపు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం కావడంతో, ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి...ఒళ్ళంతా పచ్చడి కావాలంటే బయటికి రండి అంటూ పొలిసు వారు చేస్తున్న హెచ్చరికల స్లోగన్ ని జోడించి తన ట్విట్టర్ అకౌంట్ లో వ్యంగ్యంగా  కాసేపటి క్రితం వర్మ మరొక పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వర్మ చేసిన ఆ ట్వీట్, పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: