బాలయ్య చాలా మంది హీరోయిన్లతో నటించాడు. ఆయన సీనియర్ హీరోల్లో ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన వారిగా ముందుంటారు. ఇక బాలయ్య ఈ వయసులో కూడా ఆడిపాడుతున్నారు. ఆయన గత పాతికేళ్ళుగా ఇద్దరు ముగ్గురు భామలతోనే ఆటా పాటా చేస్తున్నారు. దీంతో బాలయ్య అంటే మినిమం ఇద్దరు  హీరోయిన్లు అన్న పేరు వచ్చేసింది.

 

 

ఇక బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ మూవీలో బాలయ్యకు ఎంత మంది హీరోయిన్లు అన్న డౌట్ ఇపుడు ఫ్యాన్స్ కి వస్తోందిట. ఎందుకంటే ఈ సినిమాలో మొదట అనుకున్న సీనియర్ నటి శ్రియను కొనసాగిస్తున్నారని లేటెస్ట్ టాక్. ఆమెతో పాటు మరో సీనియర్ హీరోయిన్ ప్రియమణిని కూడా అడిగారట. ఆమె బాలయ్యతో మిత్రుడు మూవీతో జంట కట్టింది.

 

వీరిద్దరూ కాకుండా అంజలి కూడా ఉంది. ఇపుడు వినిపిస్తున్న మరో మాట చూస్తే ఈ మూవీలో ఏకంగా పాతిక మంది హీరోయిన్లు ఉంటారట. బాలయ్యతో వారంతా ఆడుతారో పాడుతారో. లేక యుధ్ధమే చేస్తారో తెలియదు కానీ కీలకమైన పాత్రలకు బాలయ్యతో గతంలో చేసిన హీరోయిన్లనే తీసుకోవాలని బోయపాటి డిసైడ్ అయ్యాడుట. ఆ విధంగా చూసుకుంటే అలనాడు బాలయ్య సాంగులేసుతున్న భామలంతా ఇపుడు ఈ బాలక్రిష్ణుడితో ప్రతీ సీన్లో ఉంటారన్న మాట.

 

వినడానికే ఇది బాగుంది. మరి స్క్రీన్ మీద చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా. దాన్ని చేసి చూపించగల దమ్మున్న డైరెక్టర్ బోయపాటి  ఉన్నారు. ఇక బాలయ్య ఎంతమంది అయినా నేను రెడీ అనే సరస శ్రుంగార‌ హీరో. ఈ కాంబోలో  వస్తున్న మాస్ మసాలా  యాక్షన్ మూవీలో రొమాన్స్ కూడా దిట్టంగా ఉంటుందంటే ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లొట్టలేస్తున్నారు. మరి కన్నులకు పండుగ కావాలంటే దసరా వరకూ వెయిట్ చేయల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: