త‌మిళ‌నాట నెగిటివ్ షేడ్స్ క‌లిగిన లేడీ పాత్ర‌ల‌కు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. విల‌నీ త‌ర‌హా పాత్ర‌ల‌ను ఆమెను దృష్టిలో పెట్టుకునే ర‌చ‌యిత‌లు రాస్తున్నారు. ఆమె పోషించిన ఆ త‌ర‌హా పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నాయి. త‌మిళంలో ఆమె చేసిన విల‌నీ పాత్ర‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కులు నుంచి కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

 

ఈ నేప‌ధ్యంలోనే ర‌వితేజ‌తో గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్న సినిమాలో నెగిటివ్ షేడ్స్‌తో కూడిన ఒక కీల‌క‌మైన పాత్ర కోసం వ‌ర‌ల‌క్ష్మిని తీసుకున్నారు. ఆమెకి సంబంధించిన సీన్స్‌ని చిత్రీక‌రిస్తున్నారు. ద‌ర్శ‌కుడు ఆమె పాత్ర‌ను చాలా కొత్త‌గా డైజ‌న్ చేశాడ‌ట‌. ఆమె పాత్ర‌లోని వైవిధ్యం ఈ సినిమాని హైలెట్‌గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. ఈ సినిమా త‌రువాత ఈ త‌ర‌హా పాత్ర‌ల‌తో ఆమె తెలుగులోను బీజీ కావ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ఇక గ‌తంలో ఎప్పుడూ కూడా ఇంత యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ విల‌న్స్ ఇప్ప‌టి వ‌రకు ఎవ్వ‌రూ లేరు. పందెంకోడి ఇంకో రెండు మూడు చిత్రాల్లో వ‌ర‌ల‌క్ష్మి విల‌న్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. 

 

ఇక విల‌న్ అంటేనే వ‌ర‌ల‌క్ష్మి అన్న‌ట్లుగా ద‌ర్శ‌కులు ఆమె కోసం కొన్ని పాత్ర‌లు రాస్తున్నారు. ఆమె విల‌న్ పాత్ర‌లో అంత‌లా మెప్పిస్తుంది. ఇక ఆమె యాక్టింగ్ విష‌య‌నికి వ‌స్తే ఎటువంటి పాత్ర‌నైనా స‌రే అవ‌లీల‌గా పోషించేస్తుంది. త‌ను హీరోయిన్‌గా న‌టించిన సినిమాల‌కంటే కూడా విల‌న్‌గా నటించిన సినిమాలే ఎక్కువ‌. అంతేకాక ఆమె ఓ  ఫైర్ బ్రాండ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆమె మాటలు ముక్కుసూటిగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంటారామే. అస్సలు ఎక్క‌డా మొహ‌మాట‌ప‌డ‌కుండా ఏం చెప్పాల‌నుకున్నా చెప్పేస్తారు. అందుకే ఆమెను విమర్శించేవారు కూడా ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్లకు ఆమె ఇచ్చే సమాధానం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. వరలక్ష్మి తాజాగా ‘వెల్వెట్ నగరం’ అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: