కొత్తదనం కోసం కావచ్చు లేదా తక్కువ సమయంలో కోట్లు సంపాదించవచ్చు అన్న ఆలోచన కావచ్చు .. మొత్తానికి టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున బుల్లితెర పై మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో ఎంట్రీ ఇచ్చారు. సిల్వర్ స్క్రీన్ మీద సక్సస్ అయిన నాగార్జున చిన్న స్క్రీన్ మీద సక్సస్ అవుతారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేసారు. అయితే నాగార్జున స్మాల్ స్క్రీన్ మీద తనదైన మార్క్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని కొంగ్ అనిపించుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.

 

ఇదే మీలో ఎవరు కోటీశ్వరుడు షో సీజన్ 2 కి హోస్ట్‌గా వ్యవహరించి అమితంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మెగాస్టార్. ఇలా.. నాగార్జున, చిరంజీవి సిల్వర్ స్క్రీన్  నుంచి స్మాల్ స్క్రీన్ కి రావడం విశేషం. అయితే.. ఈ ఇద్దరి సీనియర్ స్టార్ హీరోలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యంగ్ హీరోలు కూడా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ సీజన్‌ 1 కు హోస్ట్‌గా చేశారు.

 

మాస్‌లో పిచ్చ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ చేసి అదరగొట్టాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 2కు నేచురల్ స్టార్ నానిని హోస్ట్‌గా ఎంచుకోగా నాని ఆకట్టుకోలేకపోయాడు. దాంతో సోషల్ మీడియాలో నానిపై విమర్శలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 3కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయడం.. ఆ షో గ్రాండ్ సక్సస్ అవ్వడం.. రికార్డు స్ధాయిలో టీఆర్పీ రేటింగ్ రావడం అంతా అలా అయిపోయింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

 

అయితే ఇప్పుడు ఒక ఆసక్తి కరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకూ వెండితెర ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, నానిల ఇన్స్పిరేషన్ తోనే జగపతి బాబు కూడా బుల్లితెర మీద నిర్వహించే ఓ కార్యక్రమానికి హోస్ట్‌ గా వ్యవహరించబోతున్నారని తాజా సమాచారం. అయితే ఈ విషయంలో జగపతి బాబు కి కాస్త నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయట.

 

ఇప్పటి వరకు హీరోగా, సెకండ్ ఇన్నింగ్స్ లో ఫాదర్ అండ్ స్టైలిష్ విలన్ గా మంచి ఫాం లో క్రేజ్ తో ఉన్న మీకు ఇలాంటి షోలు అవసరమా అంటూ సలహాలిస్తున్నారట. ఎందుకిలాంటి పనులు చేయడం మంచి నేం ఫేం అన్ని ఊరికే రాలేదు కదా ..ఇప్పుడవన్నిఅంటుంన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: