యువ హీరో మరోసారి తన నోటి దురుసు ప్రవర్తించాడు. జనతా కర్ఫ్యూ నెక్స్ట్ డే జనాలంతా ఒక్కసారిగా బయటకు రావడంపై కోపంగా మీ ఉప్పర్ మీటింగ్స్ ఏంట్రా.. అంటూ జనాల మీద ఫైర్ అయ్యాడు. అదే అతన్ని టార్గెట్ అయ్యేలా చేసింది. జనాలంతా తమ  బయటకు ఉప్పర్  మీటింగ్  పెట్టడానికి అంటావా అంటూ అతని మీద రివర్స్ లో ట్రోల్స్ చేశారు. ఎవరి అవసరం ఎలాంటిదో అయినా ఈ విషయం తనకు ఎందుకు అనుకున్నాడో ఏమో మళ్ళీ విశ్వక్ మరో వీడియో పెట్టి తాను మాట్లాడిన తీరుకి కొనిరి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది దానికి నన్ను క్షమించండి అంటూ కూల్ గా చెప్పాడు.

 

యువ హీరో ముందునుండి కొద్దిగా నోటి దురుసుగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. సినిమా ప్రమోషన్స్ లో కూడా బూతు మాటలు మాట్లాడుతూ హడావిడి చేస్తాడు. చేసింది మూడు సినిమాలే  అయినా విశ్వక్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలో హీరో ఎలా మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుందేమో కానీ బయట అలా కాదు. పెద్ద స్టార్స్ కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడాలి అన్నది ఆలోచించి మాట్లాడుతారు. అలాంటిది జనాల మీద విశ్వక్ అలా రెచ్చిపోయి కామెంట్ చేయడం మళ్ళీ తిరిగి సారీ చెప్పడం చూస్తుంటే మనోడి తొందరపాటుతనం అందరికి అర్ధమవుతుంది. 

 

హీరోగా మంచి స్థానం సంపాదించుకోవాలి అంటే ఈ నోటి దురుసుతనం కచ్చితమా తగ్గించుకోవాల్సిందే. లేదంటా ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడక తప్పదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట్లో ఇలాంటి దూకుడే చూపించాడు. అయితే సినిమాల ఫలితాలు తేడా కొడుతుండటం వల్ల ఇప్పుడు కొద్దిగా మారాడు. విశ్వక్ సేన్ కూడా ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి కదా అని రెచ్చిపోతే తర్వాత ఖాళీ అవ్వాల్సి వస్తుంది. మరియు ఈ విషయాన్ని గుర్తించి మనోడు లోపల తన ఫీలింగ్స్ ఏవైనా మాట్లాడే ముందు మంచిగా మాట్లాడితే బెటర్ అంటున్నారు ప్రేక్షకులు.   

మరింత సమాచారం తెలుసుకోండి: