కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీకి 152వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష, అనుష్క హీరోయిన్స్ అనుకోగా ఫైనల్ గా కాజల్ అగర్వాల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఉందన్న విషయం తెలిసిందే. ముందు ఆ పాత్రకు మహేష్ ను అనుకోగా ఆయన కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్  ను ముందు ఒకే చెప్పినా తర్వాత సారీ చెప్పాడు. ఇప్పుడు సినిమాలో ఆ పాత్రని చరణ్ చేస్తున్నాడు. ఎలాగూ సినిమా నిర్మాత కూడా చరణే కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ కూడా కంట్రోల్ చేయొచ్చని అలా నిర్ణయించారు. 

 

అయితే లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం చరణ్ ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపిస్తాడట. చరణ్ చేయాలనుకున్న పని మధ్యలో ఆగిపోతుందట. అంటే ఇందులో చరణ్ పాత్ర చనిపోతుందని తెలుస్తుంది. అతను పూర్తి చేయాలని అనుకున్న పనిని చిరు చేస్తాడట. అదే ఆచార్య కథ అని తెలుస్తుంది. ఇప్పటికే చిరు నక్సలైట్ లుక్ లీక్ అవగా.. బయట వినిపిస్తున్న కథ కూడా నిజమే అంటున్నారు. ఏది ఏమైనా మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న డైరక్టర్ కొరటాల శివ ఆచార్యని అంచనాలు అందుకునేలా తీస్తాడని చెప్పొచ్చు. 

 

ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. చిరు, మణి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి. మళ్ళీ కా కాంబో రిపీట్ అవుతుంది. సినిమాలో కాజల్ తో పాటుగా రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుందని తెలుస్తుంది. ఖైదీ నంబర్ 150, సైరా సినిమాలతో సక్సెస్ అందుకున్న చిరు ఈ సినిమాతో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. చూస్తుంటే కొరటాల శివ చిరుతో ఒక సంచలనం సృష్టించేలా ఉన్నాడు,

మరింత సమాచారం తెలుసుకోండి: